
గుడిని పరిశీలిస్తున్న స్థానికులు
యాదగిరిగుట్ట (ఆలేరు) : దండగులు ఆలయంలోని మైమ్మ అమ్మవారి విగ్రహాన్ని అపహరించారు. ఈ ఘటన యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని పెద్దిరెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. దీంతో గ్రామానికి చెందిన భక్తులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దిరెడిగూడెంలో కొన్ని సంవత్సరాల క్రితం మైసమ్మ వేప చెట్టు కింద వెలసింది. దీంతో గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం అమ్మవారిని పూజించేందుకు స్థానికంగా ఉన్న రైతులు వెళ్లారు. దీంతో గుడిలో అమ్మవారు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురైన రైతు, పాతగుట్టలో ఉంటున్న పెద్దిరెడ్డిగూడెం గ్రామస్తులకు తెలిపారు. అక్కడ పరిశీలించిన గ్రామస్తులు ఆలయం వద్ద క్షుద్ర పూజలు చేసి ఉంటారని, చంద్రగ్రహనం రోజున పూజలు చేసి అమ్మవారిని, అమ్మవారిపై ఉన్న బంగారు పుస్తె, మెట్టెలను తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా ఆలయానికి ఉన్న గేట్ వద్ద, చెట్ల పొదల్లో కంకణాలు, చిన్న చిన్న గురుగులు పడేయంతో పాటు కుంకుమ, పసుపు చల్లినట్లు ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు తెలిపారు. గతంలో ఎన్నడూ ఇలాంటివి కాలేదని, ప్రస్తుతం ఈ పూజలు చేసి అమ్మవారిని గుడిలో నుంచి తీసుకెళ్లడంతో భయం వేస్తుందని మహిళలు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment