Maisamma statue
-
మైసమ్మతల్లి విగ్రహం అపహరణ
యాదగిరిగుట్ట (ఆలేరు) : దండగులు ఆలయంలోని మైమ్మ అమ్మవారి విగ్రహాన్ని అపహరించారు. ఈ ఘటన యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని పెద్దిరెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. దీంతో గ్రామానికి చెందిన భక్తులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దిరెడిగూడెంలో కొన్ని సంవత్సరాల క్రితం మైసమ్మ వేప చెట్టు కింద వెలసింది. దీంతో గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం అమ్మవారిని పూజించేందుకు స్థానికంగా ఉన్న రైతులు వెళ్లారు. దీంతో గుడిలో అమ్మవారు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురైన రైతు, పాతగుట్టలో ఉంటున్న పెద్దిరెడ్డిగూడెం గ్రామస్తులకు తెలిపారు. అక్కడ పరిశీలించిన గ్రామస్తులు ఆలయం వద్ద క్షుద్ర పూజలు చేసి ఉంటారని, చంద్రగ్రహనం రోజున పూజలు చేసి అమ్మవారిని, అమ్మవారిపై ఉన్న బంగారు పుస్తె, మెట్టెలను తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా ఆలయానికి ఉన్న గేట్ వద్ద, చెట్ల పొదల్లో కంకణాలు, చిన్న చిన్న గురుగులు పడేయంతో పాటు కుంకుమ, పసుపు చల్లినట్లు ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు తెలిపారు. గతంలో ఎన్నడూ ఇలాంటివి కాలేదని, ప్రస్తుతం ఈ పూజలు చేసి అమ్మవారిని గుడిలో నుంచి తీసుకెళ్లడంతో భయం వేస్తుందని మహిళలు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయంశమైంది. -
మాయమ్మా... మైసమ్మా..! ఏమయ్యావమ్మా..?!
కట్ట మైసమ్మ తల్లి ఎక్కడుంటుంది..?చెరువు కట్టపై..! ఎప్పటి నుంచో ఆ చెరువు కట్టపై భక్తుల పూజలందుకుంటున్న ఆ మైసమ్మ తల్లి... సోమవారం అర్థరాత్రి మాయమైంది..!! ఆందోళన, ఆవేదన మిళితమైన స్వరంతో ఆ గ్రామస్తులు ఇలా ప్రశ్నిస్తున్నారు... ‘మాయమ్మా... మైసమ్మా..! ఎక్కడికెళ్లావమ్మా... ఏమయ్యావమ్మా..? మాయమయ్యావా.. మాయం చేశారా..?!’ మధిర: చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలోని ఊర చెరువుపై కట్ట మైసమ్మ తల్లి రాతి విగ్రహం ఎప్పటి నుంచో ఉంది. భక్తుల పూజలు అందుకుంటోంది. పక్కనే పోతురాజు విగ్రహం కూడా ఉంది.మంగళవారం ఉదయమే కూలీ,పొలం పనులకు కట్ట మీదుగా వెళుతున్న కొందరికి.. అక్కడ ఉండాల్సిన రెండు విగ్రహాల్లో ఒకటి (మైసమ్మ తల్లి) కనిపించలేదు. ముందు రోజు (సోమవా రం) సాయంత్రం కూడా తమకు కనిపిం చిన కట్ట మైసమ్మ తల్లి విగ్రహం.. ఇంతలోనే ఎలామాయమైందన్న సందేహం వచ్చింది. గ్రామంలోకి వెళ్లి మిగతా అందరికీ చెప్పారు. అంద రూ కలిసి అక్కడకు చేరుకున్నారు. చుట్టుపక్కల వెతికారు. ఎక్కడ కని పించలేదు. సర్పంచ్‌గొడుగు రమేష్, ఎం పీటీసీ సభ్యుడు కొప్పుల గోవిందరావు ఇచ్చిన సమాచారంతో ఆ చెరు వు కట్ట వద్దకు ఎస్సై పోగులసురేష్ వచ్చారు. పోతురాజు విగ్రహం ఒక్కటే ఉం డడాన్ని గమనించారు. పరిసరాలను పరిశీ లించారు. మండలంలోని ఆలయాల్లో ఇటీవల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో.. స్థానిక గుడులను, వాటికి రక్షణ ఏర్పాట్లను పరిశీలించా రు. ఇంతకీ, కట్ట మైసమ్మ తల్లి విగ్రహం ఏమైన ట్టు..? ‘ఆ తల్లికి కాళ్లు రాలేదు. ఎక్కడికీ వెళ్లలేదు. కళ్లు, కాళ్లు.. రెండూ నెత్తికెక్కిన ఎవడో దుండగు డు.. ఆ తల్లి విగ్రహాన్ని చెరువులోకి విసిరేసి ఉం టాడేమో!’ అని,గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
మైసమ్మ విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన వ్యక్తి
* వెంబడించి పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన జనం * రాత్రి 11 గంటలకు విగ్రహాన్ని పున:ప్రతిష్ఠించిన గ్రామస్తులు ధారూరు: మండల పరిధిలోని తిమ్మానగరం గ్రామ చెరువుకట్టపై కట్టమైసమ్మ దేవత విగ్రహాన్ని ఓ వ్యక్తి పెకిలించి తీసుకువెళ్లాడు. దీంతో ఆ గ్రామస్తులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు.ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వుండలంలోని కుక్కింద గ్రామానికి చెందిన బోయ నారాయణ కొడుకు మహేశ్ తిమ్మానగరం గ్రామ సమీప చెరువు వద్దకు వచ్చి అక్కడ సారాతాగాడు. తాగిన మైకంలో అక్కడే కట్ట మైసమ్మ విగ్రహాన్ని తీసి కుక్కింద గ్రామ సమీపంలోని పానాదిలో పడేసి అక్కడే కూర్చున్నాడు. ఇది గమనించిన తివ్మూనగరం గ్రామస్తులు కొందరు కుక్కింద గ్రామానికి వెళ్లారు. గ్రావుంలో అతన్ని పట్టుకుని విగ్రహం గురించి ఆరా తీశారు. పానాదిలో విగ్రహాన్ని పడేసినట్లు అతడు చెప్పాడు. అదేరాత్రి సమాచారం తెలుసుకున్న పోలీసులు కుక్కింద గ్రామానికి చేరుకుని జరిగిన సంఘటనపై విచారించారు. పోలీసులు మహేశ్‌ను పట్టుకుని విగ్రహం పడేసిన పానాది వద్దకు తీసుకువెళ్లారు. అక్కడే ఉన్న విగ్రహాన్ని అతనితోనే చెరువుకట్ట వద్ద రాత్రి 11:30 గంటల ప్రాంతంలో పాలాభిషేకం చేసి, పూజలు నిర్వహించి యథాతథంగా పున: ప్రతిష్ఠచేయించారు. దీంతో తిమ్మానగరం, కుక్కింద గ్రామాల మధ్య గొడవ సద్దుమణిగింది.