మైసమ్మ విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన వ్యక్తి | Maisamma statue Ettukellina person | Sakshi
Sakshi News home page

మైసమ్మ విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన వ్యక్తి

Published Tue, Jan 27 2015 3:24 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

మైసమ్మ విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన వ్యక్తి - Sakshi

మైసమ్మ విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన వ్యక్తి

* వెంబడించి పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన జనం  
* రాత్రి 11 గంటలకు విగ్రహాన్ని పున:ప్రతిష్ఠించిన గ్రామస్తులు

ధారూరు: మండల పరిధిలోని తిమ్మానగరం గ్రామ చెరువుకట్టపై కట్టమైసమ్మ దేవత విగ్రహాన్ని ఓ వ్యక్తి పెకిలించి తీసుకువెళ్లాడు. దీంతో ఆ గ్రామస్తులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు.ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వుండలంలోని కుక్కింద గ్రామానికి చెందిన బోయ నారాయణ కొడుకు మహేశ్ తిమ్మానగరం గ్రామ సమీప చెరువు వద్దకు వచ్చి అక్కడ సారాతాగాడు. తాగిన మైకంలో అక్కడే కట్ట మైసమ్మ విగ్రహాన్ని తీసి కుక్కింద గ్రామ సమీపంలోని పానాదిలో పడేసి అక్కడే కూర్చున్నాడు.

ఇది గమనించిన తివ్మూనగరం గ్రామస్తులు కొందరు కుక్కింద గ్రామానికి వెళ్లారు. గ్రావుంలో అతన్ని పట్టుకుని విగ్రహం గురించి ఆరా తీశారు.  పానాదిలో విగ్రహాన్ని పడేసినట్లు అతడు చెప్పాడు. అదేరాత్రి సమాచారం తెలుసుకున్న పోలీసులు కుక్కింద గ్రామానికి చేరుకుని జరిగిన సంఘటనపై విచారించారు. పోలీసులు మహేశ్‌ను పట్టుకుని విగ్రహం పడేసిన పానాది వద్దకు తీసుకువెళ్లారు. అక్కడే ఉన్న విగ్రహాన్ని అతనితోనే చెరువుకట్ట వద్ద రాత్రి 11:30 గంటల ప్రాంతంలో పాలాభిషేకం చేసి, పూజలు నిర్వహించి యథాతథంగా పున: ప్రతిష్ఠచేయించారు. దీంతో తిమ్మానగరం, కుక్కింద గ్రామాల మధ్య గొడవ సద్దుమణిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement