చంపావత్: ఉత్తరాఖండ్‌లో హృదయవిదారక ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా చంపావత్ జిల్లాలోని సీల్ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఈ గ్రామానికి ఇతర ప్రాంతాలతో సంబంధం పూర్తిగా తెగిపోయింది. అయితే ఇదే సమయంలో గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలు లక్ష్మీదేవి(60)ని ఆస్పత్రికి తరలించడంలో చేయూతనందించి మానవత్వాన్ని చాటుకున్నారు ఆ గ్రామస్తులు.
గ్రామం నుంచి ఆస్పత్రికి వెళ్లే రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో గ్రామస్తులు డోలీ సాయంతో బాధితురాలు లక్ష్మీదేవిని సుమారు మూడు కిలోమీటర్లు ముందుకు తీసుకువెళ్లి, ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీల్ గ్రామంలో ఉంటున్న జోగా సింగ్ భార్య లక్ష్మీదేవి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఆస్పత్రికి తరలించేందుకు రోడ్డు మార్గం సరిగాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామస్తులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. డోలీ సాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. గంగలి, నేత్ర సలాన్‌ల మధ్య రోడ్డు పూర్తిగా మూసుకుపోయిందని గ్రామస్తులు తెలిపారు. వీలైనంత త్వరగా రోడ్డును బాగుచేయించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
सड़क बंद एंबुलेंस बनी 'डोली'..
उत्तराखंड: चंपावत में ग्रामीणों ने तीन किलोमीटर पैदल चलकर सड़क तक बीमार महिला को ऐसे पहुंचाया.#Uttarakhand । #Champawat । #Ambulance pic.twitter.com/7sL9cnRqCL— NDTV India (@ndtvindia) September 23, 2024
ఇది కూడా చదవండి: మానవత్వమా.. కళ్లు మూసుకో!
Comments
Please login to add a commentAdd a comment