పరామర్శిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
దామరచర్ల/ మిర్యాలగూడ టౌన్ : మండల కేంద్రం లోని గిరిజన గురకుల పాఠశాలలో పదవతరగతి చదువుతున్న జి. అనూష ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది. సోమవారం పాఠశాల మ ధ్యాహ్న భోజన సమయంలో జింకోవిట్–5, పా రాసెటిమాల్–7 మాత్రలు మింగింది. దీనిని గమనించిన తోటి విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇవ్వడంతో సదరు విద్యార్థినిని స్థానిక పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి మెరుగైన చికిత్సకై తరలించారు. కాగా ఈ విద్యార్థినిది సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యపహాడ్. తమ ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఆదివారం తన తండ్రితో వెళ్లి సోమవారమే పాఠశాలకు తిరిగి వచ్చింది. ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తండ్రి బాలు ఆరోపించాడు. కాగా తాను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి తెలిపాడు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారణాలు, మాత్రలు ఎలా వచ్చాయనేది తెలియదన్నారు.
వేధింపులు భరించలేకే..
తాను ఈ గురుకుల పాఠశాలలో 7వ తరగతి నుంచి హాస్టల్‌లో ఉంటూ చదువుతున్నా. తనను పాఠశాల ఉపాధ్యాయుడు వెంకట్‌నారాయణ 8వ తరగతిలో వేధింపులకు గురిచేయడంతో కుటుంబ సభ్యులకు తెలియజేశాను. ఆ తరువాత 9వ తరగతిలో కూడా అనేక వేధింపులకు గురిచేశారు. ఇటీవల ఓ యువకుడు పాఠశాల వద్దకు రాగా ఇతను ఎవరు..నీ కోసం వచ్చాడా.. అంటూ ప్రిన్సిఫాల్‌తో పాటు అధ్యాపకురాలు అడిగారు. తనకు ఎవరో తెలియదని కూడా చెప్పాను. అప్పటి నుంచి అనేక సార్లు కూడా ఇబ్బందులకు గురి చేశారని కన్నీటి పర్యంతం అయింది. నీవు ఫోన్లు ఎక్కువగా మాట్లాడుతున్నావు.. ఎవరితో మాట్లాడుతున్నావు.. ఆ యువకుడు నీ కోసమే వచ్చాడంటూ అనడంతో తాను ఎంతో మనస్తాపానికి గురయ్యానని అనూష పేర్కొంది.
ప్రిన్సిపాల్ వేధింపులకు గురి చేస్తున్నాడు
తన కుతూరును పాఠశాల ప్రిన్సిపాల్ చాల కాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ప్రిన్సిపాల్ తన కుతూరుపై అసభ్యకరంగా కూడా మాట్లాడటంపై తాను నిలదీశాం. తరుచూ నీ కుతూరు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది వెంటనే నీ కుతూరుకి పెళ్లి చేయి అని అన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన తమ్ముడు తన కుతూరు తీసుకువచ్చేందుకు పాఠశాల వద్దకు వస్తే మేము పంపమని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు తన కుతూరుపై అసభ్యకరంగా మాట్లాడాడని ఆరోపించారు. కనీసం పిల్లల మరుగుదోడ్లు కూడా శుభ్రంగా లేవని, మంచినీళ్లు కూడా సరిగా ఉండవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. –అనూష తల్లిదండ్రులు
పిల్లలందరూ డాడీ అంటారు
తాను ఎవరిని కూడా వేధింపులకు గురి చేయలేదు. తాను ప్రిన్సిపాల్ అయినప్పటికీ అందరూ డాడీ అంటారు. 10వ తరగతి విద్యార్థిని అయినందున ఇంటికి ఎవరినీ కూడా పంపించడం లేదని, తాను కూడా క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. అనూష అన్న వచ్చి టీచరును దుర్భషలాడాడని ఏడ్చింది. అనూష తండ్రి బాలు ఆదివారం సాయంత్రం వచ్చి మా ఇంట్లో పండుగ ఉందని చెప్పి ఆమ్మాయిని తీసుకెళ్లే ముందు పర్మిషన్ లెటరును రాయించుకొని పంపించా. – సుధాకర్‌రెడ్డి, ప్రిన్సిపాల్, దామరచర్ల
వేధింపులకు గురి చేయలేదు
తాను ఎవరిని కూడా వేధింపులకు గురిచేయలేదు. ప్రస్తుతం 10వ తరగతి క్లాసులు నడుస్తున్నందున వాళ్ల సోదరుడు వస్తే పంపించనని చెప్పానని పేర్కొంది. ఒక సారి మా బంధువులు చనిపోయారని చెప్పింది. వాళ్ల తమ్ముడే తనను దుర్భశలాడడని అంటుంది. తన చెల్లెలు మాదిరిగానే చూసుకుంటున్నాను కానీ ఎవరిని కూడా వేధించలేదు. ఆరోపణలు అవాస్తవం. – పుష్పలత, ఉపా«ధ్యాయురాలు
Comments
Please login to add a commentAdd a comment