హుజూర్‌నగర్‌: భారీగా మద్యం పట్టివేత | Heavy Alcohol Seized In Huzurnagar | Sakshi
Sakshi News home page

హుజూర్‌నగర్‌: భారీగా మద్యం పట్టివేత

Published Sat, Oct 12 2019 8:04 AM | Last Updated on Sat, Oct 12 2019 8:04 AM

Heavy Alcohol Seized In Huzurnagar - Sakshi

మఠంపల్లి : అక్రమ మద్యాన్ని సీజ్‌ చేస్తున్న అధికారులు

సాక్షి, మఠంపల్లి(హుజూర్‌నగర్‌): మండలకేంద్రం లోని ప్రధానరహదారి పక్కనగల హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వెనుకగల ఓ ఇంటిలో అక్రమంగా నిల్వచేసిన రూ.11లక్షల 52వేల విలువగల 9,600 మద్యం బాటిళ్లను శుక్రవారం సాయంత్రం అధికారులు దాడులు నిర్వహించి స్వాధీ నం చేసుకుని సీజ్‌ చేశారు. ఈవిషయమై ఎక్సైజ్‌ సీఐ శ్రీనివాసు స్థానికంగా మాట్లాడారు. అక్రమంగా మద్యం బాటిళ్లను నిల్వ ఉచిన పక్కా సమాచారం మేరకు ఫ్లయింగ్‌స్వా్కడ్, ఎంసీసీ బృందం, ఎక్సైజ్‌ సిబ్బందితో దాడులు నిర్వహించామన్నారు. ఈదాడుల్లో ఎంసీ, ఐబీబ్లూ కంపెనీలకు చెందిన 200ల కాటన్లలో 9వేల 600ల బాటిళ్లను కనుగొని స్వాధీనం చేసుకుని సంబంధిత గృహ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో ఫ్లయింగ్‌స్క్వాడ్, ఎంసీసీ బృందం, ఎక్సైజ్‌ సిబ్బంది తదితరులున్నారు. 

కల్తీమద్యం స్థావరంపై పోలీసుల దాడులు
మేళ్లచెర్వు(హుజూర్‌నగర్‌): కల్తీ మద్యం తయారు చేస్తున్న స్థావరంపై ఎక్సైజ్, స్థానిక పోలీసులు కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌ అధికారులు విలేకరులతో మాట్లాడుతూ బెల్టుషాపులకు మద్యం సరఫరా చేసే నర్సిరెడ్డి అనే వ్యక్తి మండలంలోని హేమ్లా తండా పరిధిలో ఓ ఇంట్లో కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లుగా గుర్తించి శుక్రవారం దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 2 లీటర్ల స్పిరిట్, 100 క్వాటర్‌ బాటిళ్లు, 30 ఫుల్‌ బాటిళ్లు, 30 బీర్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మండలంలోని గ్రామాల్లో దాడులు నిర్వహించి 4 బెల్టు షాపులు సీజ్‌ చేయడంతో పాటు ఐదుగురిపై ఎక్సైజ్‌ యాక్ట్‌ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను ఎక్సైజ్‌ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. దాడుల్లో కోదాడ రూరల్‌ సీఐ శివరాంరెడ్డి, అనంతగిరి ఎస్‌ఐ రామంజనేయులు, మేళ్లచెర్వు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.  

రూ.రెండు లక్షల నగదు స్వాధీనం
మోతె(కోదాడ): హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల సందర్భంగా శుక్రవారం చెక్‌పోస్టు వద్ద పోలీ సులు, ఎన్నికల సిబ్బంది వాహనాల తనిఖీల్లో రూ. రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మోతె  మండల పరిధిలో ఖమ్మం– సూర్యాపేట రహదారిలో మామిళ్లగూడెం చెక్‌ పోస్టు వద్ద ఎస్‌ఎస్‌టీ టీం వాహనాల తనిఖీ చేపట్టారు. ఖమ్మం నుంచి సూర్యాపేటకు స్కూ టీపై వెళ్తున్న వసంతరావు స్కూటీని తనిఖీ చేయగా రెండు లక్షల ఇరువై వేల రూపాయల నగదును ఎస్‌ఎస్‌టీ టీం లీడర్‌ బాలునాయక్, సీఐ శివశంకర్,ఎస్‌ఐ గోవర్ధన్‌ స్వాధీనం చేసుకొని స్థానిక తహసీల్దార్‌ సరస్వతికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది వెంకన్న, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement