liquor seized
-
నాన్ డ్యూటీ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
-
పచ్చ మద్యం స్వాధీనం..
-
930 మద్యం సీసాలు స్వాధీనం
హనుమాన్ జంక్షన్ రూరల్: ప్రభుత్వ వైన్ షాపు ఉద్యోగి అక్రమార్కులతో చేతులు కలిపి భారీ మొత్తంలో మద్యం సీసాలు తరలిస్తుండగా హనుమాన్ జంక్షన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలు నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు మంగళవారం మీడియాకు చెప్పారు. స్థానిక గుడివాడ రోడ్డులోని వేగిరెడ్డి థియేటర్ వద్ద ఉన్న ప్రభుత్వ వైన్‌షాపు నుంచి భారీ మొత్తంలో మద్యం సీసాలను కారులో తరలిస్తున్నట్లుగా సోమవారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. హనుమాన్‌జంక్షన్ ప్రధాన కూడలిలో సీఐ కె.సతీష్, ఎస్ఐలు పామర్తి గౌతమ్‌కుమార్, కార్తిక ఉషారాణి వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో గుడివాడ నుంచి నూజివీడు వైపు వెళ్తున్న మారుతీ కారులో రూ.1,39,500 విలువ చేసే 930 మద్యం బాటిళ్లు గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించటంతో సరైన సమాచారం చెప్పకుండా వారు పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ వైన్‌షాపులో సూపర్వైజర్గా పనిచేస్తోన్న పశ్చిమగోదావరి జిల్లా అప్పనవీడు గ్రామానికి చెందిన మద్దాల రమేష్ కొంతకాలంగా హనుమాన్జంక్షన్కు చెందిన మొవ్వ ప్రసాద్‌తో చేతులు కలిపి అడ్డదారిలో మద్యం సీసాలు తరలిస్తున్నట్లు నిర్థారించారు. వీరి నుంచి 930 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోవటంతో పాటుగా నిందితులను అరెస్ట్ చేసి మంగళవారం నూజివీడు కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. సీఐ కె.సతీష్, ఎస్ఐలు పామర్తి గౌతమ్‌కుమార్, కార్తిక ఉషారాణి, సహకరించిన కానిస్టేబుళ్లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వీరికి రివార్డులు అందించేందుకు సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించారు. -
టీడీపీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ మద్యం
గడివేముల(కర్నూలు జిల్లా): జిల్లాలోని గడివేముల టీడీపీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ సుబ్బరామిరెడ్డి చెప్పారు. పార్టీ కార్యాలయం సమీపంలో తెలంగాణ మద్యం ఉందన్న సమాచారం రావడంతో గురువారం సిబ్బందితో దాడులు నిర్వహించినట్టు చెప్పారు. 121 క్వార్టర్స్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని, టీడీపీ కార్యకర్త వడ్డె రామకృష్ణ పరారీలో ఉన్నట్టు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంచేందుకే మద్యాన్ని తెచ్చినట్టు తెలుస్తోంది. (చదవండి: ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం!) ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం -
రిపోర్టర్ ఇంట్లో మద్యం పట్టివేత
-
ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఇంట్లో మద్యం పట్టివేత
సాక్షి, అనంతపురం : కళ్యాణదుర్గంలో ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శంకర్ నాయక్ ఇంట్లో భారీగా మద్యం బయటపడింది. అతడి ఇంటి నుంచి 368 బాటిళ్ల కర్ణాటక మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రజ్యోతి విలేకరి శంకర్ నాయక్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా లాక్డౌన్ సమయంలోనూ అక్రమంగా మద్యం విక్రయించినట్లు శంకర్ నాయక్‌పై పలు ఆరోపణలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. (ఆంధ్రజ్యోతి వాహనం సీజ్) -
హుజూర్నగర్: భారీగా మద్యం పట్టివేత
సాక్షి, మఠంపల్లి(హుజూర్నగర్): మండలకేంద్రం లోని ప్రధానరహదారి పక్కనగల హెచ్‌పీ పెట్రోల్ బంక్ వెనుకగల ఓ ఇంటిలో అక్రమంగా నిల్వచేసిన రూ.11లక్షల 52వేల విలువగల 9,600 మద్యం బాటిళ్లను శుక్రవారం సాయంత్రం అధికారులు దాడులు నిర్వహించి స్వాధీ నం చేసుకుని సీజ్ చేశారు. ఈవిషయమై ఎక్సైజ్ సీఐ శ్రీనివాసు స్థానికంగా మాట్లాడారు. అక్రమంగా మద్యం బాటిళ్లను నిల్వ ఉచిన పక్కా సమాచారం మేరకు ఫ్లయింగ్‌స్వా్కడ్, ఎంసీసీ బృందం, ఎక్సైజ్ సిబ్బందితో దాడులు నిర్వహించామన్నారు. ఈదాడుల్లో ఎంసీ, ఐబీబ్లూ కంపెనీలకు చెందిన 200ల కాటన్లలో 9వేల 600ల బాటిళ్లను కనుగొని స్వాధీనం చేసుకుని సంబంధిత గృహ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో ఫ్లయింగ్‌స్క్వాడ్, ఎంసీసీ బృందం, ఎక్సైజ్ సిబ్బంది తదితరులున్నారు. కల్తీమద్యం స్థావరంపై పోలీసుల దాడులు మేళ్లచెర్వు(హుజూర్నగర్): కల్తీ మద్యం తయారు చేస్తున్న స్థావరంపై ఎక్సైజ్, స్థానిక పోలీసులు కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు విలేకరులతో మాట్లాడుతూ బెల్టుషాపులకు మద్యం సరఫరా చేసే నర్సిరెడ్డి అనే వ్యక్తి మండలంలోని హేమ్లా తండా పరిధిలో ఓ ఇంట్లో కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లుగా గుర్తించి శుక్రవారం దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 2 లీటర్ల స్పిరిట్, 100 క్వాటర్ బాటిళ్లు, 30 ఫుల్ బాటిళ్లు, 30 బీర్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మండలంలోని గ్రామాల్లో దాడులు నిర్వహించి 4 బెల్టు షాపులు సీజ్ చేయడంతో పాటు ఐదుగురిపై ఎక్సైజ్ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. దాడుల్లో కోదాడ రూరల్ సీఐ శివరాంరెడ్డి, అనంతగిరి ఎస్ఐ రామంజనేయులు, మేళ్లచెర్వు ఎస్ఐ ప్రవీణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. రూ.రెండు లక్షల నగదు స్వాధీనం మోతె(కోదాడ): హుజూర్నగర్ ఉప ఎన్నికల సందర్భంగా శుక్రవారం చెక్‌పోస్టు వద్ద పోలీ సులు, ఎన్నికల సిబ్బంది వాహనాల తనిఖీల్లో రూ. రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మోతె మండల పరిధిలో ఖమ్మం– సూర్యాపేట రహదారిలో మామిళ్లగూడెం చెక్ పోస్టు వద్ద ఎస్ఎస్టీ టీం వాహనాల తనిఖీ చేపట్టారు. ఖమ్మం నుంచి సూర్యాపేటకు స్కూ టీపై వెళ్తున్న వసంతరావు స్కూటీని తనిఖీ చేయగా రెండు లక్షల ఇరువై వేల రూపాయల నగదును ఎస్ఎస్టీ టీం లీడర్ బాలునాయక్, సీఐ శివశంకర్,ఎస్ఐ గోవర్ధన్ స్వాధీనం చేసుకొని స్థానిక తహసీల్దార్ సరస్వతికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది వెంకన్న, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. -
ఏపీవ్యాప్తంగా రూ. 196 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం
-
24 కోట్ల విలువైన మద్యం పట్టివేత
సాక్షి, బెంగుళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యం భారీగా పట్టుబడుతొంది. మంగళవారం ఒక్క రోజే దాదాపు రూ.24 కోట్ల విలువైన మద్యాన్ని ఐటీ, పోలీసు శాఖలు సీజ్ చేశాయి. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో గెలవడానకి అభ్యర్థులు, పార్టీలు ప్రజలకు డబ్బు, మద్యం భారీగా పంచుతున్నారు. డబ్బు, మద్యమే కాకుండా బంగారం, వెండి కూడా పోలీసుల దాడిలో పట్టుబడింది. దాదాపు 43 కోట్ల విలువైన బంగారం, వెండిని సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 77 కోట్ల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల నుంచి అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యం, బంగారం, వెండి భారీగా లభిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 166 కోట్ల విలువైన డబ్బు, మద్యం, బంగారం, వెండిని సీజ్ పోలీసులు సీజ్ చేశారు. ఎలాగన్న గెలవాలని పార్టీలు విచ్చలవిడిగా డబ్బు, మద్యాన్ని పంచుతున్నాయి. -
బిహార్ లో పెద్ద ఎత్తున మద్యం స్వాధీనం
లిక్కర్ బ్యాన్ నూరుశాతం అమలవుతున్న బీహార్‌లో దాడులు నిర్వహించిన అధికారులు వేల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేశీయ, విదేశీ మద్యం అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయన్న పక్కా సమచారంతో దాడులు జరిపిన పోలీసులు 16 వేల లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి, 44 మందిని అరెస్టు చేశారు. కొత్త బీహార్ ఎక్సైజ్ సవరణ చట్టం 2016 ప్రకారం బీహార్ లోని మొత్తం 655 ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మద్య నిషేధం పూర్తి శాతం అమల్లో ఉన్న రాష్ట్రంలో అక్రమ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారంతో అధికారులు సోదాలు చేసినట్లు ఓం ప్రకాష్ మండల ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. 14.108 దేశీయ, 2,386 లీటర్ల విదేశీ బ్రాండ్ల మద్యం బాటిళ్ళను సీజ్ చేసి... 44 మందిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. మార్చి 31న బీహార్‌లో ఆమోదించిన బిల్లు ఫలితంగా... మద్యానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆపరేషన్ లో ఎక్సైజ్ పోలీసులు ప్రోత్సాహక ఫలితాలను సాధించారు. జిల్లాలో మద్య నిషేధానికి వ్యతిరేకంగా అమ్మకాలు జరుపుతున్న 24 మందిని అరెస్ట్ చేసినట్లు పాట్నా సీనియర్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ మను మహరాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తిశాతం మద్య నిషేధాన్ని అమలు పరిచే నేపథ్యంలో వివిధ జిల్లాల్లోని డీ ఎడిక్షన్ కేంద్రాల నుంచి వ్యసనపరుల నివేదికలు కూడ అందుకున్నట్లు ఆయన తెలిపారు. -
ఆకస్మిక తనిఖీలు : సారా వ్యాపారులు అరెస్ట్
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం పులిమడుగు వద్ద శనివారం పోలీసు, అటవీ శాఖ, ఆర్టీఏ, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 28 వాహనాలు సీజ్ చేశారు. అలాగే రూ. లక్ష విలువైన టేకు, కలపతోపాటు 125 లీటర్ల సారా, 2500 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు. 10 మంది సారా వ్యాపారులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ నేతల ఇళ్లల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు
కర్నూలు : పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్లను మద్యంతో ప్రలోభపెట్టేందుకు టీడీపీ యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా మహానంది మండలం సీతారామపురం, బండి ఆత్మకూరు మండలం నారాయణపురంలో తెలుగు దేశం పార్టీ నేతల ఇళ్లల్లో ఎక్సైజ్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమంగా పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన మద్యాన్ని అధికారులు గుర్తించారు. మద్యం స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు.