
సాక్షి, బెంగుళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యం భారీగా పట్టుబడుతొంది. మంగళవారం ఒక్క రోజే దాదాపు రూ.24 కోట్ల విలువైన మద్యాన్ని ఐటీ, పోలీసు శాఖలు సీజ్ చేశాయి. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో గెలవడానకి అభ్యర్థులు, పార్టీలు ప్రజలకు డబ్బు, మద్యం భారీగా పంచుతున్నారు. డబ్బు, మద్యమే కాకుండా బంగారం, వెండి కూడా పోలీసుల దాడిలో పట్టుబడింది. దాదాపు 43 కోట్ల విలువైన బంగారం, వెండిని సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 77 కోట్ల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల నుంచి అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యం, బంగారం, వెండి భారీగా లభిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 166 కోట్ల విలువైన డబ్బు, మద్యం, బంగారం, వెండిని సీజ్ పోలీసులు సీజ్ చేశారు. ఎలాగన్న గెలవాలని పార్టీలు విచ్చలవిడిగా డబ్బు, మద్యాన్ని పంచుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment