దారుణం | Step Father Sexual Assult On Daughter | Sakshi
Sakshi News home page

దారుణం

Published Fri, Mar 9 2018 7:48 AM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

Step Father Sexual Assult On Daughter - Sakshi

కాచిగూడ: మారుతండ్రే ఓ యువతికి మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మహిళా దినోత్సవం రోజే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే డిఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్, కాచిగూడ రైల్వే  ఇన్స్‌పెక్టర్‌ దాసరి విజయ్‌లాల్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. బాలానగర్‌ ఐడిపిఎల్‌ కాలనికి చెందిన మాధవికి, బెల్లంపల్లికి చెందిన మల్లేష్‌తో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉంది. చదువు పేరుతో రెండేళ్ల క్రితం మాధవి కూతురు (17)ను బెల్లంపల్లికి రప్పించుకున్న మల్లేష్, ఆమెకు మద్యం తాగించి, నోట్లో గుడ్డలు కుక్కి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంతటితో ఆగకుండా ఓ ఆటో డ్రైవర్‌ వద్దకు పంపగాచ  అతనితో పాటు మరో ముగ్గురు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

అయితే గత కొద్ది రోజులుగా బాధితురాలు జ్వరంతో బాధపడుతుండటంతో మల్లేష్‌ భార్య లక్ష్మి ఆమెను బెల్లంపల్లిలోని స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆమె గర్భం దాల్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మల్లేష్‌ తన కూతురు కనిపించడంలేదని బెల్లంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్‌ కాచిగూడలో సమోసాలు విక్రయించే వ్యక్తితో పాటు మరికొందరు ఆమెపై లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో బెల్లంపల్లి పోలీసులు  కేసును కాచిగూడ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. సమోసాల విక్రయం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్నందున కాచిగూడ పోలీసులు కేసును రైల్వే పోలీసులకు బదిలీ చేశారు. రైల్వే డిఎస్పీ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు ఐడీపీఎల్‌లోని బాధితురాలి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా బాధితురాలు మారు తండ్రే తనకు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని, అనంతరం ఓ ఆటో డ్రైవర్‌ వద్దకు పంపడంతో అతనితో పాటు మరో ముగ్గురు ఆత్యాచారం చేసినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆమెను గత నెల 14న న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఘటన బెల్లంపల్లిలో జరిగినందున కేసును బెల్లంపల్లి పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ఇన్స్‌పెక్టర్‌ విజయ్‌లాల్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement