
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తెను ఎంతో ఆప్యాయంగా చూసుకోవాల్సిన తండ్రి కాల్చి వాతలు పెట్టి శాడిస్టు అనిపించుకున్నాడు. అడ్డగుట్టలో నివాసముంటున్న నాలుగేళ్ల చిన్నారిపై మారు తండ్రి ప్రవీణ్ తన పైశాచికత్వాన్ని చూపాడు. అభంశుభం తెలియని చిన్నారి అని చూడకుండా శరీరంపై ప్రతిచోటా వాతలు పెట్టడమేగాక ఆమె గోళ్లు కూడా తీసేశాడు ఆమెకు నరకం చూపించాడు.
ప్రవీణ్ గత కొంతకాలంగా చిన్నారిని చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం ప్రతినిధులు నార్త్ జోన్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment