ఉగాది పర్వదినాన అభం శుభం తెలియని ఓ రెండేళ్ల చిన్నారిని హత్య చేసిన దారుణ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది.
హైదరాబాద్ : ఉగాది పర్వదినాన అభం శుభం తెలియని ఓ రెండేళ్ల చిన్నారిని ఆమె తండ్రే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన సీతయ్య అనే వ్యక్తి ఓ రెండేళ్ల చిన్నారికి పెంపుడు తండ్రి. చిన్నారి తనకు అడ్డుగా ఉందనుకున్నాడో లేక భారం అనుకున్నాడో గానీ ... పసిపాప అని కూడా చూడకుండా చంపేశాడు ఆ కసాయి పెంపుడు తండ్రి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.