
ప్రతీకాత్మక చిత్రం
భోపాల్ : పద్నాలుగేళ్ల బాలికపై కన్నేసిన సవతి తండ్రి ఐదు నెలలకు పైగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. దెవాస్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలు ఆరోగ్యం బాగా లేదని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా గర్భం దాల్చినట్టు వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఐదు నెలలుగా సవతి తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు వెల్లడించిందని కటేగావ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ విశ్వదీప్ సింగ్ పరిహర్ చెప్పారు.
సవతి తండ్రి లైంగిక వేధింపుల గురించి తల్లికి చెప్పినా ఆమె పట్టించుకోలేదని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు విజయ్ బైరాగిని అరెస్ట్ చేసి పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment