నిన్న ప్రత్యూష.. నేడు భవాని.. అంతలోనే సంధ్య..! తల్లిదండ్రులు, బంధువుల చేతుల్లో హింసకు గురవుతున్న చిన్నారుల ఉదంతాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి.
జవహర్‌నగర్: నిన్న ప్రత్యూష.. నేడు భవాని.. అంతలోనే సంధ్య..! తల్లిదండ్రులు, బంధువుల చేతుల్లో హింసకు గురవుతున్న చిన్నారుల ఉదంతాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నాలుగేళ్ల చిన్నారి సంధ్యను హింసిస్తోన్న మారుతండ్రిని రంగారెడ్డి జిల్లా జవహర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ వెంకటగిరి తెలిపిన వివరాల ప్రకారం..
జవహర్‌నగర్‌లోని బీజేఆర్‌నగర్‌లో నివాసముండే ప్రమీల కుమార్తె సంధ్య(04)ను మారుతండ్రి ప్రశాంత్‌కుమార్ కొన్ని రోజులుగా చిత్రహింసలకు గురిచేశాడు. ఇంట్లో అల్లరి చేస్తోందని, సరిగా చదవడం లేదనే నెపంతో ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టాడు. చిన్నారి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు ప్రమీల, ప్రశాంత్ కుమార్ల ఇంటిపై దాడిచేసి చిన్నారిని కాపాడారు. వేధింపులు, హింస విషయంలో ప్రమీల, ప్రశాంత్‌కుమార్‌ను పోలీసులు ప్రశ్నించారు. అనంతరం ప్రశాంత్‌కుమార్‌ను రిమాండుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.