మైనర్‌పై సవతి తండ్రి అత్యాచారం | Minor girl was raped by her step father | Sakshi
Sakshi News home page

మైనర్‌పై సవతి తండ్రి అత్యాచారం

Published Wed, Jun 18 2014 1:15 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

మైనర్‌పై సవతి తండ్రి అత్యాచారం - Sakshi

మైనర్‌పై సవతి తండ్రి అత్యాచారం

ముంబై: మలాడ్ పట్టణ ప్రాంతంలో మైనర్ బాలికపై సవతి తండ్రి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని బుధవారం పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. స్థానికంగా నివాసముంటున్న అజీమ్ షేక్(35), సవతి కుమార్తె(14)పై గత ఫిబ్రవరి నుంచి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఆమె తల్లికి అతడు రెండో భర్త.. తల్లి పనికి బయటకు వెళ్లిన ప్రతిసారీ బాలికపై షేక్ లైంగిక దాడికి పాల్పడుతుండటంతో భరించలేక ఆమె అదే ప్రాంతంలో ఉంటున్న మేనమామ ఇంటికి వెళ్లిపోయింది.
 
కాగా, మంగళవారం సాయంత్రం పని నుంచి తిరిగి వచ్చిన తల్లికి కూతురు ఇంటి వద్ద కనిపించకపోవడంతో షేక్‌ను ప్రశ్నించింది. ఆమె మేనమామ ఇంటికి వెళ్లిపోయిందని చెప్పడంతో షేక్‌ను వెంటబెట్టుకుని ఆమె తన అన్న ఇంటికి వెళ్లింది. కూతురిని ఇంటికి రమ్మని పిలిస్తే నిరాకరించడంతో ఆమె తన అన్నతో గొడవకు దిగింది. దీంతో అసలు విషయం బయటపడింది. తనపై షేక్ గత నాలుగు నెలలుగా అత్యాచారానికి ఒడిగడుతున్నాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాలిక తెలి పింది. బాలిక ఫిర్యాదు మేరకు మాల్వాని పోలీ సులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement