
కర్ణాటక, హోసూరు: ఓ మహిళ ప్రియుడితో కలిసి మద్యం సేవిస్తూ కుమార్తెకు కూడా మద్యం తాపించగా ఆ చిన్నారి అస్వస్థతకు గురైంది. ఈ ఘటన హొసూరులో చోటు చేసుకుంది. హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని బెళ్తూరు జీవానగర్‌కు చెందిన నందిని(27) భర్తను వదలి ఒంటరి జీవితం గడుపుతుంది. ఈమెకు నయనశ్రీ(4) అనే కుమార్తె ఉంది. నందినికి అదే ప్రాంతానికి చెందిన కూలి కార్మికుడు అశోక్(29)తో వివాహేతర సంబంధం ఏర్పడింది.
తరచూ ఇద్దరూ మద్యం సేవించేవారు. ఆదివారం రాత్రి కూడా ఇద్దరు మద్యం సేవిస్తూ నయనశ్రీనికి కూడా గ్లాసులో మందు పోసి ఇచ్చారు. దానిని సేవించిన చిన్నారి స్పృహ కోల్పోయింది. స్థానికులు గమనించి చిన్నారిని హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం క్రిష్ణగిరికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నందిని, ఆమెప్రియుడు అశోక్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment