జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పారిశ్రామిక వేత్త ఆనంద్ మహాంద్ర ఒక అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమ్మాయిలకు చిన్న చేయూత దొరికితే కాలు అద్భుతాలు చేసి చూపిస్తారనే సందేశంతో ఈవీడియోను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేశారు. అద్భుత విజయాలు చిన్న సపోర్ట్, సాయం చాలు. ఇది మాటల్లోకాదు చేతల్లో అనునిత్యం ప్రతీ రోజు సాగాలి. ప్రతిరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డేనే అంటూ నాన్హి కాలీ అధికారిక హ్యాండిల్ పోస్ట్ చేసిన వీడియోను తన అభిమానుల కోసం షేర్ చేశారు ఆనంద్ మహీంద్ర.
సెజు అనే అమ్మాయి సక్సెస్ స్టోరీని ఈ వీడియోలో పొందుపర్చింది. ఫుట్‌బాల్ అంటే ఇష్టమున్న సెజును టోర్నమెంట్‌లో ఆడటానికి మొదట తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో సెజు లేకుండానే పోటీలకు వెళ్లిన జట్టు కప్పు గెల్చుకుని వస్తుంది. ఈ విజయాన్ని గ్రామస్తులంతా సంబరం చేసుకుంటారు. ఇది చూసి..తన బిడ్డ కలల్ని అడ్డుకున్నది తామేనని గుర్తిస్తారు తల్లిదండ్రులు. అంతేకాదు ఇంకెపుడూ ఆమె ఆశలకు, కలలకు అడ్డు రాకూదని నిర్ణయించుకుంటారు. ఫలితంగా సెజు పుట్‌బాల్ క్రీడకే కాదు.. తను పుట్టిన గడ్డకు కూడా పేరు తీసుకొస్తుంది.
మహీంద్ర అండ్ మహీంద్ర ఆధ్వరంలోని నాంది ఫౌండేషన్‌తో పాటు, నాన్హి కాలీ ప్రాజెక్ట్ భారతదేశంలోని ప్రతి నిరుపేద బాలికా విద్య, గుర్తింపు పొందే హక్కును పొందేలా చేస్తుంది. బాలికా విద్యకు మద్దతిస్తుంది. సెజు లాగా, లక్షలాది మంది అమ్మాయిల కలలు ప్రాజెక్ట్ నాన్హి కాలీ ద్వారా కౌన్సెలింగ్, యువతులు, వారి తల్లిదండ్రులకు మద్దతిస్తుందని నాన్హి కాలీ ట్విటర్ ద్వారా తెలిపింది.
A little support goes a long way!
— nanhikali (@NanhiKali) January 24, 2024
Despite her talent, Seju, a young girl, was not allowed to join her football team in a tournament. However, when the team returned, it changed everything.
Watch the video to know what happened.
Like Seju, the dreams of lakhs of girls are… pic.twitter.com/dQlCbsoRuP
Comments
Please login to add a commentAdd a comment