
నిందితుడు ప్రశాంత్
బంజారాహిల్స్: ఓ బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడటమే గాక ఆమె గర్భం దాల్చడానికి కారకుడైన యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే..బోరబండ శ్రీరాంనగర్ బస్తీకి చెందిన బ్యాగరోళ్ల ప్రశాంత్ స్థాని విజేత టాకీస్‌లో హౌస్ కీపింగ్ పనిచేసేవాడు. 2017, ఏప్రిల్ 28న అతను సినిమా చూసేందుకు వచ్చిన బ్రహ్మశంకరనగర్ బస్తీకి చెందిన బాలికను మాయమాటలతో లోబరుచుకొని లైంగికదాడికి పాల్పడ్డాడు.
దీనిపై అప్పుడు కేసు నమోదైంది. ఆ తర్వాత కూడా పలుమార్లు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ నెల 22న సదరు బాలిక గర్భం దాల్చినట్లు గుర్తించిన ఆమె తల్లి నిలదీయడంతో బాధితురలు అసలు విషయం చెప్పింది. ప్రశాంత్ తనను తరచూ బైక్‌పై పార్కులు, సినిమాలు, ఆలయాలకు బైక్‌పై తీసుకెళ్లేవాడని, గతేడాది జూలైలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనపై లైంగికదాడికి పాల్పడినట్లు తెలిపింది. పలుమార్లు శ్రీరాంనగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిపింది. దీంతో బాధితురాలితో కలిసి ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.