
మాట్లాడుతున్న సీఐ ఖాజావలీ
నెల్లూరు,తోటపల్లిగూడూరు: బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటనలో యువకుడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లుగా కృష్ణపట్నం పోర్ట్ సీఐ ఖాజావలీ తెలిపారు. తోటపల్లిగూడూరు పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నెల్లూరు మనుమసిద్ధినగర్‌కు చెందిన రాచగిరి విఘ్నేష్ ఓ బాలిక (14)తో పరిచయం పెంచుకున్నాడు. గత నెల 20వ తేదీన అతను ఆమెకు మాయమాటలు చెప్పి తోటపల్లిగూడూరు మండంలోని మండలంలోని తన అక్క ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి వారి సాయంతో తోటపల్లిగూడూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తును ప్రారంభించారు. నిందితుడు విఘ్నేష్‌ను గురువారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment