
ముంబై: ఆడబిడ్డకు జన్మనిచ్చిన భార్యను చంపుతానంటూ బెదిరింపులకు దిగడమే కాకుండా ఆసుపత్రి సిబ్బందిని గాయపరిచిన వ్యక్తిని బరామతి(పుణే) పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పుణేకు చెందిన కృష్ణ కాలే భార్య జూన్ 25న బరామతి డోర్లేవాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆడబిడ్డ పుట్టడం ఇష్టం లేని కాలే మద్యం సేవించి ఆసుపత్రికి వచ్చాడు. తాగిన మైకంలో భార్యను చంపుతానంటూ గొడవ చేశాడు. ఈ నేపథ్యంలో అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆస్పత్రి సిబ్బందిపై రాళ్లతో దాడి చేశాడు. అంతేగాక తన భార్యను అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు దిగాడు. (పోలీసుల దాష్టీకానికి మరో వ్యక్తి బలి)
దీంతో బరామతి పోలీసులకు ఆస్పత్రి సిబ్బంది సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బరామతి సీనియర్ ఇన్‌స్పెక్టర్ ఆడుంబర్ పాటిల్ మాట్లాడుతూ.. ‘కాలే ఆసుపత్రికి వచ్చి ఆడ శిశువుకు జన్మనిచ్చినందుకు భార్యను వేధించడమే కాకుండా అక్కడి సిబ్బందిపై దాడి చేశాడు. ఇక అతడిని అరెస్టు చేసి ఐపీసీ 353 (విధిలో ఉన్న ఒక ప్రభుత్వ సేవకుడిపై దాడి చేయడం లేదా క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించడం), 333 (తన విధిని నిర్వర్తించడంలో ఒక ప్రభుత్వ ఉద్యోగిని తీవ్ర హాని కలిగించడం), 504 (50) (శాంతిని ఉల్లంఘించడం) 506 (నేర బెదరింపులు) సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం’ అని పేర్కొన్నారు. (కళ్ల ముందు హత్య: పరారైన పోలీసులు)
Comments
Please login to add a commentAdd a comment