The baby was rescued from a field in Chhattisgarh: చత్తీస్‌గఢ్‌లో ముంగేలి జిల్లాలో లోర్మీ సరిస్టాల్ గ్రామంలోని స్థానికులు ఒక పసికందు కేకలు విని అటుగా వెళ్లి చూడగా అప్పుడే పుట్టిన నవజాత శిశువు పొలం వద్ద పడి ఉండటాన్ని గుర్తించారు. అంతేకాదు ఒక తల్లి కుక్క తన ఆరు పిల్లలతో ఆ నవజాత శిశువుని రాత్రి అంతా కాపాల కాసి మరీ రక్షించింది. అయితే స్థానికుల్ని నుంచి ఈ సమాచారం అందుకున్న టాస్కఫోర్స్ బృందం ఘటనస్థలికి వచ్చి విచారించారు.
(చదవండి: ‘ఆ రోజు చేసిన పని నన్ను పదే పదే కలచివేసింది')
ఈ మేరకు ఏఎస్‌ఐ చింతారామ్ బింజ్వార్ శిశువును సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు చిన్నారిని ది చైల్డ్ లైన్ ప్రాజెక్ట్‌కి రిఫర్ చేసి ఆకాంక్ష అని పేరు పెట్టారు. కాగా, నవజాత శిశువు కుటుంబం కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన విషయాలతోపాటు ఫోటోలను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు ఈ వార్త చదివిన తర్వాత తాను కలత చెందానని, కూతురు, కొడుకు అనే లింగవివక్షను గురించి ఆలోచించి ఉంటే మీరు తల్లిదండ్రులగా ఉండటానికి తగినవారు కాదని ట్విట్టర్‌లో ఆవేదనగా పేర్కొన్నారు.
(చదవండి: గిట్టుబాటు ధర లేక 160 కేజీల ఉల్లిపాయల్ని తగలబెట్టిన రైతు!!)
खबर पढ़कर मन व्यथित हो गया.
— Dipanshu Kabra (@ipskabra) December 19, 2021
बच्ची को पुलिस ने अस्पताल पहुंचा दिया है, मामले की छानबीन जारी है.
यदि आप बेटा-बेटी में भेद-भाव की सोच से ग्रस्त हैं तो आप अभिभावक बनने लायक नहीं हैं.
दोषियों को कानून के तहत सख्त सजा मिले. ऐसे पाप रोकें, दकियानूसी सोच त्यागें, बेटा-बेटी एक समान मानें. pic.twitter.com/JDD5tQExSu
Comments
Please login to add a commentAdd a comment