ట్విటర్ బాస్‌గా అవతారం ఎత్తిన ఎలాన్ మస్క్..ఊహించని నిర్ణయాలతో నిత్యం ఏదొ ఒక అంశంపై సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలుస్తుంటారు. ముఖ్యంగా ట్విటర్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపులు, సంస్థాగత నిర్మాణం (organizational structure)లో మార్పులు చేస్తున్నారు. పనిలో పనిగా ట్విటర్‌లో యాక్టీవ్‌గా ఉంటున్నారు.
సందర్భాను సారం ట్వీట్‌లు చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల చూపు తన వైపు మరల్చేలా చేస్తున్నారు. అందుకు ఉదాహరణే తాజాగా మస్క్ చేసిన ట్వీట్. ఆ ట్వీట్‌కు ఉత్తర ప్రదేశ్ పోలీసులు రిప్లయి ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది.
ట్విటర్ సీఈవోగా ఆ సంస్థ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఆఫీస్‌లో జరిగే మీటింగ్స్, డెవలప్‌మెంట్స్‌ను ఎప్పటికప్పుడు ట్వీట్‌ల రూపంలో నెటిజన్లతో పంచుకుంటున్నారు.
ఈ తరుణంలో మస్క్.. ‘వెయిట్ , నేను ట్వీట్ చేస్తే, అది పనిగా మీరు పరిగణిస్తారా?’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఆ ట్వీట్ ఉత్తర ప్రదేశ్ పోలీసుల్ని ఆకర్షించింది. వెంటనే మస్క్ ట్వీట్‌కు చమత్కారంగా సమాధానం ఇచ్చారు. ‘వెయిట్,@uppolice మీ సమస్యలను ట్వీట్ ద్వారా పరిష్కరిస్తే, అది మీరు పనిగా పరిగణిస్తారా?’ అని పోలీసు శాఖ రిప్లయి ఇచ్చింది.
ఆ తర్వాత కొద్ది సేపటికి యూపీ పోలీసులు ఆ ట్వీట్‌లను స్క్రీన్ షాట్ తీసి నెట్టింట్లో షేర్ చేశారు. పోలీసులు ఇచ్చిన ఎపిక్ రిప్లయ్‌పై నెటిజన్లకు ఫిదా అవుతున్నారు. వావ్, సెల్యూట్, బ్యూటిఫుల్ రిప్లయి ఇస్తున్నారు. ఇంకెందుకు అలస్యం ఆ ట్వీట్‌లను మీరూ చేసేయండి.
Yes it does!#TwitterSevaUPP @elonmusk pic.twitter.com/qfGxAdvjkj
— UP POLICE (@Uppolice) November 25, 2022
😂😂 Love it https://t.co/sjgEvvHBt7
— Anshuman Rai (@AnshumanRai3) November 26, 2022
Beautiful reply by @Uppolice https://t.co/W7pW7cbyMZ
— Commando Sumit Bhardwaj (@commando_sumit) November 26, 2022
చదవండి👉 పాక్ అభిమాని గూబ గుయ్‌మనేలా..గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ రిప్లయ్ అదిరింది
Comments
Please login to add a commentAdd a comment