
ప్రతీకాత్మక చిత్రం
రంగారెడ్డి, కొత్తూరు: ప్రేమపేరుతో బాలికను నమ్మించి గర్భవతిని చేసి ఓ యువకుడు వదిలేశాడు. పెళ్లి చేసుకోమంటే కులం తక్కువ అంటూ వదిలేయడంతో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన కొత్తూరు మండలంలోని మక్తగూడ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహేందర్ (21), బాలిక ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రేమమాయలో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. తీరా పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. దీంతో రెండు రోజుల కిందట కుటుంబసభ్యులు గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. బాలికను వివాహం చేసుకోనని ఆ యువకుడు తేల్చిచెప్పాడు. దీంతో తనకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయమై సీఐ చంద్రబాబును వివరణ కోరగా బాలిక ఫిర్యాదు వాస్తవమేనన్నారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment