పోలీసుస్టేషన్ వద ్దతమ కుమార్తెతో కలిసి సంఘటనను వివరిస్తున్న వైష్ణవి తల్లిదండ్రులు
బుచ్చినాయుడుకండ్రిగ : ఇంటి ముందు ఆరుబయట తల్లిదండ్రుల పక్కన పడుకుని నిద్రిస్తున్న బాలికను అర్ధరాత్రి అపహరణకు యత్నించిన సంఘటన మండలంలోని తానిగిల్లు గిరిజన కాలనీలో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల కథనం.. తానిగిల్లుకు చెందిన మానికల వెంకటమ్మ, నాగరాజుల కుమార్తె వైష్ణవి (10) స్థానిక ప్రాథమిక పాఠశాల్లో 4 వ తరగతి చదువుతోంది. వేసవికాలం కావడంతో తల్లిదండ్రులతో కలసి సోమవారం రాత్రి ఇంటి ముందు ఆరుబయట పడుకుంది.
తల్లి పక్కన నిద్రిస్తున్న వైష్ణవిని అర్ధరాత్రి అనంతరం ఓ ఆగంతకుడు భుజాలపై వేసుకుని ఎత్తుకెళ్లాడు. వెంకటమ్మకు అకస్మాత్తుగా మెలకువ రావడం..కుమార్తె వైష్ణవి కనిపించకపోవడంతో ఆందోళన చెందింది. గమనించేసరికి తన కుమార్తెను ఎత్తుకుపోతున్న ఆగంతకుడిని గమనించి కేకలు వేసింది. దీంతో కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగువారు అతడిని వెంబడించారు. దీంతో ఆగంతకుడు పాపను తీసుకుపోవడం కుదరని గ్రహిం చి, వదిలిపెట్టి, చీకట్లో పరారయ్యాడు. మంగళవా రం వైష్ణవి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఏఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment