బాబాయే బాలికను వెంబడించి.. | Molestation on Daughter in SPSR Nellore | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగికదాడి

Published Wed, Jul 15 2020 11:37 AM | Last Updated on Wed, Jul 15 2020 11:37 AM

Molestation on Daughter in SPSR Nellore - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నెల్లూరు ,ఆత్మకూరు: పొలంలో మేకలు మేపుకునేందుకు వెళ్లిన బాలికను వెంబడించి మాయమాటలతో మభ్యపెట్టి బాబాయి వరసైన వ్యక్తి లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆత్మకూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసుల కథనం మేరకు ఆత్మకూరు మండలం బసవరాజుపాళెం గ్రామానికి చెందిన ఓ మైనర్‌(12) మూడు రోజుల క్రితం మేకలు మేపేందుకు పొలానికి వెళ్లింది. ఆ బాలికకు బాబాయి వరసయ్యే యువకుడు తిరుపతయ్య(ఉరఫ్‌ సురేష్‌) ఆ బాలికను వెంబడించి పొలంలో మాయమాటలు చెప్పాడు. సెల్‌ఫోన్లో నీలిచిత్రాలు చూపించి ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధిత బాలిక ఈ విషయాన్ని ఆలస్యంగా తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం తిరుపతయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement