
కామంతో అతడి కళ్లు మూసుకుపోయాయి. కన్నకూతురనే విచక్షణను కోల్పోయాడు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: కామంతో అతడి కళ్లు మూసుకుపోయాయి. కన్నకూతురనే విచక్షణను కోల్పోయాడు. పదే పదే తన పశువాంఛను తీర్చుకోగా బాలిక గర్భం దాల్చింది. ఆలస్యంగా ఈ విషయాన్ని తెలుసుకున్న అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు. తమిళనాడులో జరిగిన ఈ ఘోరం వివరాలు ఇలా ఉన్నాయి. కోయంబత్తూరు జిల్లా ఆలందూర్‌కు చెందిన వ్యక్తి (35). ఇతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.13 ఏళ్ల పెద్ద కుమార్తె అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా బాలిక తల్లి అక్కడికి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు స్కాన్ తీసి గర్భిణిగా ఉన్నట్లు చెప్పడంతో ఆమె దిగ్భ్రాంతికి గురైంది. కుమార్తెను నిలదీయగా కన్నతండ్రే కొంతకాలంగా ఈ ఆఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు కుమార్తె చెప్పడంతో ఆమె హతాశురాలైంది. ఆమె ఫిర్యాదు మేరకు బాలిక తండ్రిని పోక్సో చట్టం కింద పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.