
కర్ణాటక ,తుమకూరు : పెంపుడు తల్లి దాష్టీకానికి చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన కుణిగల్ పట్ట ణంలో చోటు చేసుకుంది.సుమారు తొమ్మిదేళ్ల క్రితం బాధిత బాలిక(11)ను తల్లితండ్రులు బ స్టాండులో వదిలేసి వెళ్లిపోయారు. ఆ సమయంలో బస్టాండులో బజ్జీలు విక్రయించుకుంటూ జీ వించే రత్నమ్మ ఆబాలికను తనతో పాటు ఇంటికి తీసుకువచ్చి పెంచసాగింది. కొద్దిరోజులు బాలిక ను బాగానే చూసుకుంటుండగా నాలుగేళ్ల క్రితం రత్నమ్మ భర్త మృతి చెందారు. అప్పటినుంచి రత్నమ్మ ప్రవర్తనలో మార్పు వచ్చింది.
బొండాలు, బజ్జీలకు పిండి కలపాలని వేధించడంతో పాటు బస్టాండులో తోపుడిబండిపై విక్రయించాలని వేధింపులకు పాల్పడేది.ఈ క్రమంలో ఈనెల 17వ తేదీన కూడా బాలికతో వెట్టిచాకిరీ చేయించగా బాలిక నిరాకరించడంతో చెలాకీతో బాలిక తొ డలపై వాతలు పెట్టింది. గమనించిన ఉపాధ్యాయులు బాలికను విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.దీంతో బాలికను ఆసుపత్రికి తరలించి విషయాన్ని సీడీపీఓ అధికారిణి అనుషా దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు స్పందించి బాలికను బాలికల బాలభవన్‌కు తరలించారు. కుణిగల్ పోలీసులు రత్నమ్మను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment