
ఇంటిముందు ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి, తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నం చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్: ఓ బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి యత్నించిన సంఘటన కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో సోమవారం జరిగింది. నిందితుడికి బాధిత కుటుంబసభ్యులు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పజెప్పారు. ఇంటిముందు ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి, తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నం చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై షేక్ మస్తాన్‌వలీ తెలిపారు.