మంచినీళ్లు అడిగి అత్యాచారయత్నం | Man Molestation on Girl Child in Karnataka | Sakshi
Sakshi News home page

మంచినీళ్లు అడిగి అత్యాచారయత్నం

Published Thu, Sep 12 2019 7:52 AM | Last Updated on Thu, Sep 12 2019 7:52 AM

Man Molestation on Girl Child in Karnataka - Sakshi

బాలిక నీరు తీసుకొచ్చేందుకు ఇంటి లోపలికెళ్లగానే గణేషన్‌ ఇంట్లోకి చొరబడి వాకిలికి గెడియపెట్టి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.

 కర్ణాటక  ,హొసూరు: డెంకణీకోట సమీపంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని డెంకణీకోట మహిళా పోలీసులు ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలుకు తరలించారు. డెంకణీకోట తాలూకా సాకరపల్లి సమీపంలోని కొడియాళం గ్రామానికి చెందిన గణేష్‌ (23) నిందితుడు. సోమవారం ఉదయం మదగొండపల్లికెళ్లిన అతను ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థినిని తాగడానికి నీరు అడిగాడు. బాలిక నీరు తీసుకొచ్చేందుకు ఇంటి లోపలికెళ్లగానే గణేషన్‌ ఇంట్లోకి చొరబడి వాకిలికి గెడియపెట్టి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకోగానే గణేష్‌ పరారయ్యాడు. ఈ సంఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు డెంకణీకోట మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరిపి గణేష్‌పై ఫోక్సో  కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement