
శిశువును పోలీసులకు అప్పగించేందుకు పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చిన స్థానిక మహిళలు
చంద్రగిరి : పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ తల్లికే భారమైందా? విధి రాతకు ఎదురీదలేని ఆ తల్లి బిడ్డను ఇలా వదిలించుకుందా? వరకట్న వేధింపులా? అత్తింటి పోరా..? ఆర్థిక సమస్యలా..? లేక చేసిన తప్పుకు ప్రతిఫలమా..? కారణమేంటో తెలియ దు. కానీ అప్పుడే పుట్టిన ఆడ శిశువు చెట్లపొదల్లో కళ్లు తెరిచింది. ఆకలికి తాళలేక తల్లి పాలకోసం ఏడవడంతో అటుగా వెళుతున్న మహిళలు గుర్తించి, అక్కున చేర్చుకున్నారు. వెంటనే చుట్టూ బిడ్డ సంబంధీకులు ఎవరైనా ఉన్నారేమో అని చూశా రు. ఎవరూ కానరాకపోవడంతో వెంటనే స్థానిక పోలీసులకు ఆ శిశువును అప్పగించారు. నిబంధనల ప్రకారం ఆ బిడ్డను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. శిశువు ఆచూకీ కోసం విచారిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సంఘటన తిరుచానూరు ప్రవేశ మార్గంలోని నిర్మానుష్య ప్రదేశంలో బుధవారం రాత్రి వెలుగు చూసింది.
Comments
Please login to add a commentAdd a comment