
టీ.నగర్: బాలికను కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్న ఆంధ్రా యువకుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పులియాంతోపునకు చెందిన కూలి కార్మికుడు ఒకరు తన 14 ఏళ్ల కుమార్తె కనిపించలేదని ఈనెల 8న పులియాంతోపు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బాలిక కోసం గాలిస్తూ వచ్చారు. విచారణలో బాలికను తిరుపతి నుంచి వచ్చిన వారి బంధువు ఒకరు మాయమాటలు చెప్పి ఆంధ్రాకు తీసుకువెళ్లి వివాహం చేసుకున్నట్లు తెలిసింది. పులియాంతోపు పోలీసులు ఆంధ్రాకు వెళ్లి బాలికను రక్షించి, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడి పేరు బాలకృష్ణన్ అని తెలిసింది. పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment