
చిన్నారికి రెయిన్ కోటు వేస్తున్న అమ్మమ్మ కరోనా పరీక్ష కోసం వెళుతున్న చిన్నారి
తూర్పుగోదావరి,రాజోలు: కరోనా సోకిందనే అనుమానంతో టెస్ట్‌లకు వెళ్లేందుకు ఆ చిన్నారి నానా పాట్లు పడింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఇద్దరు పిల్లలతో కలసి ఓ గృహిణి తన స్వగ్రామం పొదలాడ వచ్చింది. ఆ కుటుంబ సభ్యులకు ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా తల్లి, ఎనిమిదేళ్ల కుమారుడికి పాజిటివ్ అని తేలింది. ఆధార్ నంబర్ సమస్య కారణంగా ఐదేళ్ల చిన్నారికి టెస్ట్ చేయలేదు. పాపకు కూడా కరోనా పరీక్ష చేయాలనే డిమాండ్‌తో డిమాండే తప్ప పొదలాడ నుంచి తాటిపాక పీహెచ్‌సీకి ఆ చిన్నారిని తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. రాజోలు నుంచి కరోనా పరీక్ష కోసం వెళుతున్న ఓ యువకుడు చిన్నారిని తాటిపాక పీహెచ్‌సీకి తీసుకు వెళ్లేందుకు ముందుకు వచ్చాడు. ఆరోగ్య సిబ్బంది తీసుకొచ్చిన రెయిన్ కోటు అమ్మమ్మ చిన్నారికి వేయగా.. మాస్క్ ఇతర జాగ్రత్తలతో బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఆ చిన్నారి మోటార్‌సైకిల్ ఎక్కి కరోనా టెస్ట్‌కు వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment