ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసికందు
మదనపల్లె టౌన్: అప్పుడే పుట్టిన పసికందు. ఇంకా కళ్లు కూడా తెరవలేదు. తల్లి పొత్తిళ్లలో నులి వెచ్చని స్పర్శను అనుభవిస్తూ ఉండాల్సిన ఆ పసికందు ను కొందరు యువకులు హంద్రీ–నీవా కాలువ వద్ద పడేసిన సంఘటన గురువారం కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధిం చి మదనపల్లె సీడీపీఓ లక్ష్మీదేవి కథనం..కురబలకోట మండలం పూసావారిపల్లెకు చెందిన సోమశేఖర్ మేకలు మేపుకుని జీవనం సాగిస్తున్నాడు. గురువారం మేకలు మేపడానికి అంగళ్లు సమీపంలోని మల్లయ్యకొండకు వెళ్లా డు. అక్కడి హంద్రీ–నీవా కాలువ వద్ద మేకలు మేపుతుండగా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంలో వచ్చి బొడ్డుకూడా ఊడని, అప్పుడే పుట్టిన ఓ పసికందును హంద్రీ–నీవా కాలువ వద్ద వదలి వెళ్లిపోయారు. ఆ పసికందు ఏడుపు విన్న మేకల కాపరి స్థానికుల సాయంతో ఆటోలో తీసుకొచ్చి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేర్పించాడు. డాక్టర్లు చికిత్స చేశారు. సమాచారం అందుకున్న సీడీపీఓ, ఆస్పత్రికి చేరుకున్నారు. పసికందును అంగన్‌వాడీ ఆయాల సంరక్షణలో ఉంచారు. పసికందుకు జన్మనిచ్చిన మహిళ ఎవరో తెలుసుకోవాలని కురబలకోట, అంగ ళ్లు సూపర్‌వైజర్లను ఆదేశించారు. జన్మనిచ్చిన తల్లికి ఏం సమస్య వచ్చిందోగానీ పసికందును హతమార్చడం ఇష్టం లేక వదలి వెళ్లిపోయారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment