handri neeva canal
-
నేడు హంద్రీ–నీవాకు నీటి విడుదల
సాక్షి ప్రతినిధి కర్నూలు: టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నిర్లక్ష్యానికి, కూటమి సర్కారు నిర్వాకాలకు రాయలసీమలో దాదాపు 6.02 లక్షల ఎకరాలు బీడుగా మారే ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన సంస్థ కర్నూలు – గుంటూరు జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. గార్గేయపురం – బ్రాహ్మణకొట్కూరు మధ్య కాలువపై వంతెన నిర్మాణం కోసం పుట్టా సంస్థ కెనాల్‌ను పూడ్చివేయడంతో హంద్రీ–నీవా నీళ్లు దిగువకు విడుదల కాని దుస్థితి నెలకొంది. కాలువను పూడ్చేటప్పుడు నీళ్లు వెళ్లేందుకు వీలుగా పైపులు వేయకుండా అప్రోచ్ రోడ్డు నిరి్మంచారు. దీంతో రాయలసీమ మొత్తానికి జీవనాడి అయిన హంద్రీ–నీవాకు నీళ్లు రాకపోవడంతో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. రాత్రి కూడా పనులు.. నేడు నీటి విడుదల ‘పుట్టా పాపం.. సీమకు శాపం’ శీర్షికతో బుధవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో జలవనరులశాఖ అధికారులు ఉదయమే హంద్రీ–నీవా కెనాల్ వద్దకు చేరుకుని ప్రత్యామ్నాయాలు అన్వేíÙంచారు. ప్రస్తుతం కాలువ పూడ్చిన ప్రాంతం పక్కనే చిన్న సైజు సిమెంట్ పైపులు వేసి దానిపై రోడ్డు వేయాలని నిర్ణయించారు. రాత్రి పూట కూడా యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగించి గురువారం ఉదయానికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నేటి ఉదయం 11 గంటలకు మల్యాల వద్ద మోటార్లు ఆన్ చేసి కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. స్వల్ప ప్రవాహం ‘అనంత’కు చేరేదెలా? హంద్రీ–నీవా కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్కులు కాగా లైనింగ్ లేనందున 2,300–2,500 క్యూసెక్కులు మాత్రమే ప్రవహిస్తాయి. అయితే ఇప్పుడు పుట్టా సుధాకర్ సంస్థ తాత్కాలికంగా అమరుస్తున్న పైపుల ద్వారా 500 క్యూసెక్కులకు మించి ప్రవహించవని అధికారులు చర్చించుకుంటున్నారు. కాలువను పూడ్చి అప్రోచ్ రోడ్డు నిరి్మంచే సమయంలోనే పెద్ద పైపులు వేసి ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదు. 15 రోజులుగా నీళ్లు వదలకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు తాపీగా చిన్న సైజు పైపులు వేస్తున్నారు. పెద్ద పైపులు వేసి ఉంటే 1000–1500 క్యూసెక్కులు ప్రవహించే వీలుండేదని నీటి పారుదలశాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. దీంతో నీళ్లు విడుదల చేసినా స్వల్ప ప్రవాహం కర్నూలులోని క్రిష్ణగిరి, పత్తికొండ రిజర్వాయర్లను దాటి అనంతపురం జిల్లాకు చేరే అవకాశం కనిపించడం లేదు. కాస్త ఆలస్యంగానైనా ఈ ఏడాది కృష్ణమ్మ కరుణించింది. ఎగువ నుంచి పోటెత్తిన వరద ఉధృతితో శ్రీశైలం నిండుకుండలా మారింది. శ్రీశైలంలో 834 అడుగులకే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కూటమి ప్రభుత్వం నీళ్లు విడుదల చేయకుండా కళ్లప్పగించి చూసింది. రిజర్వాయర్‌లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో 10 గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు వదులుతున్నా హంద్రీ–నీవాకు నీటిని విడుదల చేసే మల్యాల పంప్‌లను ఇప్పటిదాకా ఆన్ చేయలేదు. నాడు రిజర్వాయర్లు కళకళ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉండగా హంద్రీ–నీవా ద్వారా 2020లో 47.34 టీఎంసీలు, 2021లో 45.65 టీఎంసీలు విడుదల చేశారు. నీటిని ఒడిసిపట్టి రైతుల సంక్షేమాన్ని కాంక్షించారు. నాడు ‘సీమ’లో చెరువులన్నీ నిండి రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టంతో కళకళలాడాయి. ఇప్పుడు చిన్నసైజు పైపులతో 500 క్యూసెక్కులు మాత్రమే ప్రవహిస్తే సీజన్ మొత్తంలో కనీసం 5 టీఎంసీలు కూడా నీటిని డ్రా చేయలేని దుస్థితి కనిపిస్తోంది. నీళ్లున్నా ఎందుకీ నిర్వాకం? చంద్రబాబు పాలనలో ప్రతిసారి రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉంది. కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తయ్యే వరకూ డిస్ట్రిబ్యూటరీల పనులు చేయవద్దని 2015 ఫిబ్రవరిలో టీడీపీ ప్రభుత్వం జీవో 22 జారీ చేసింది. దీంతో కళ్లెదుట నీళ్లు పారుతున్నా రైతులు నిస్సహాయంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా శ్రీశైలంలో నీళ్లు ఎక్కువై పది గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నా దుర్భిక్ష ‘సీమ’కు అందని దుస్థితి ఉత్పన్నమైంది. రోడ్డు నిర్మాణ ప్రాంతంలో కాలువ సామర్థ్యం మేరకు పైపులైన్లు వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించి ఉంటే పుట్టా సుధాకర్ సంస్థ ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సి వచ్చేది. పెద్ద పైపులైన్లు వేస్తే 2 వేల క్యూసెక్కులకు తగ్గకుండా ప్రవాహం దిగువకు వెళ్లేది. అన్నదాతల ఇక్కట్లపై వైఎస్సార్ సీపీ తక్షణమే స్పందించి నిలదీయడంతో ఇక తప్పించుకునే అవకాశం లేక కంటి తుడుపు చర్యలు చేపట్టారు. దీంతో హంద్రీ–నీవా నీటి కోసం రైతు సంఘాలు ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నాయి. -
జిల్లేడుబండ రిజర్వాయర్‌కు టెండర్లు
సాక్షి, అమరావతి: రాజస్థాన్‌లోని జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో సాగు, తాగునీటి సమస్య పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ, బత్తలపల్లి, ధర్మవరం, తాడిమర్రి మండలాల్లో 23 వేల ఎకరాలకు నీళ్లందించడమే లక్ష్యంగా 2.41 టీఎంసీల సామర్థ్యంతో జిల్లేడుబండ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ రిజర్వాయర్ పనులకు రూ.609.14 కోట్ల అంచనా వ్యయంతో ఎల్ఎస్(లంప్సమ్–ఓపెన్) విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. షెడ్యూళ్లు దాఖలుకు అక్టోబర్ 7ను తుది గడువుగా నిర్ణయించింది. అదే రోజున నిర్వహించే ప్రీ–బిడ్ సమావేశంలో షెడ్యూళ్లు దాఖలు చేసిన కాంట్రాక్టు సంస్థలు ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) రూపంలో రూ.6.09 కోట్ల చొప్పున తీసిన డీడీలను హంద్రీ–నీవా సుజల స్రవంతి ఎస్ఈ–2కు అందించాలి. అక్టోబర్ 11న ఆర్థిక బిడ్‌ను తెరుస్తారు. ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టు సంస్థ కోట్‌చేసిన ధరనే కాంట్రాక్టు విలువగా పరిగణించి.. అదేరోజు ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహిస్తారు. ఇందులో అతి తక్కువ ధరకు కోట్‌చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించడానికి అనుమతివ్వాలని స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ)కి ప్రతిపాదనలు పంపుతారు. హంద్రీ–నీవా రెండో దశలో అంతర్భాగంగా.. హంద్రీ–నీవా రెండో దశలో అంతర్భాగంగా జిల్లేడుబండ రిజర్వాయర్‌ను ప్రభుత్వం చేపట్టింది. హంద్రీ– నీవా ప్రధాన కాలువ 377.1 కిమీ వద్ద క్రాస్ రెగ్యులేటర్ నిర్మించి.. అక్కడి నుంచి తవ్వే కాలువ ద్వారా కొత్తగా నిర్మించే జిల్లేడుబండ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. ఈ రిజర్వాయర్ కింద తవ్వే పిల్ల కాలువల ద్వారా బత్తలపల్లి, ముదిగుబ్బ, ధర్మవరం, తాడిమర్రి మండలాల్లో 23 వేల ఎకరాలకు నీళ్లందిస్తారు. -
అయ్యో! పాపం
మదనపల్లె టౌన్: అప్పుడే పుట్టిన పసికందు. ఇంకా కళ్లు కూడా తెరవలేదు. తల్లి పొత్తిళ్లలో నులి వెచ్చని స్పర్శను అనుభవిస్తూ ఉండాల్సిన ఆ పసికందు ను కొందరు యువకులు హంద్రీ–నీవా కాలువ వద్ద పడేసిన సంఘటన గురువారం కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధిం చి మదనపల్లె సీడీపీఓ లక్ష్మీదేవి కథనం..కురబలకోట మండలం పూసావారిపల్లెకు చెందిన సోమశేఖర్ మేకలు మేపుకుని జీవనం సాగిస్తున్నాడు. గురువారం మేకలు మేపడానికి అంగళ్లు సమీపంలోని మల్లయ్యకొండకు వెళ్లా డు. అక్కడి హంద్రీ–నీవా కాలువ వద్ద మేకలు మేపుతుండగా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంలో వచ్చి బొడ్డుకూడా ఊడని, అప్పుడే పుట్టిన ఓ పసికందును హంద్రీ–నీవా కాలువ వద్ద వదలి వెళ్లిపోయారు. ఆ పసికందు ఏడుపు విన్న మేకల కాపరి స్థానికుల సాయంతో ఆటోలో తీసుకొచ్చి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేర్పించాడు. డాక్టర్లు చికిత్స చేశారు. సమాచారం అందుకున్న సీడీపీఓ, ఆస్పత్రికి చేరుకున్నారు. పసికందును అంగన్వాడీ ఆయాల సంరక్షణలో ఉంచారు. పసికందుకు జన్మనిచ్చిన మహిళ ఎవరో తెలుసుకోవాలని కురబలకోట, అంగ ళ్లు సూపర్వైజర్లను ఆదేశించారు. జన్మనిచ్చిన తల్లికి ఏం సమస్య వచ్చిందోగానీ పసికందును హతమార్చడం ఇష్టం లేక వదలి వెళ్లిపోయారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘హంద్రీనీవా’లో అక్కాతమ్ముడు గల్లంతు
కర్నూలు, పత్తికొండ రూరల్: దుస్తులు ఉతికేందుకు హంద్రీనీవా కాలువ వద్దకు వెళ్లిన అక్కా, తమ్మడు నీటి ప్రవాహంలో గల్లంతైన ఘటన బుధవారం మండల పరిధిలోని జివరాళ్లమలతండా గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. తండాకు చెందిన శివనాయక్, బాలమ్మల కుమార్తె మౌనిక నూజివీడు ట్రిపుల్ ఐటీలో ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, కుమారుడు వంశీ రాతన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శివనాయక్ ఏడాది క్రితం మృతిచెందాడు. మౌనిక, వంశీ రెండురోజుల క్రితం సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం దుస్తులు ఉతికేందుకు హంద్రీనీవా కాలువ వద్దకు వెళ్లారు. దుస్తులు ఉతుకుతుండగా కాలు జారి మౌనిక, వంశీ, మౌనిక స్నేహితురాలు రేణుక ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. అక్కడే ఉన్న కొందరు గట్టిగా కేకలు వేయడంతో పొలాల్లోని రైతులు అక్కడికి చేరుకున్నారు. గ్రామానికి చెందిన లోక్యానాయక్ కాలువలోకి దూకి రేణుకను కాపాడాడు. మిగిలిన వారికోసం కొందరు గాలించినా లాభం లేకపోయింది. దీంతో కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు విషయం చేరవేశారు. విషయం తెలుసుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. సీఐ కృష్ణయ్య పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అక్కడే ఉండి గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తు న్నారు. ఈ ఘటనతో పండుగ రోజు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
చంద్రబాబు దోపిడీని అడ్డుకుంటాం
సాక్షి, రొద్దం: హంద్రీ–నీవా కాలువ పనులు వేగవంతం చేసి అన్ని చెరువులను నీటితో నింపాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. మండలంలోని ఎన్జీబీ నగర్ సమీపంలో జరుగుతున్న హంద్రీ–నీవా మడకశిర బ్రాంచ్ కెనాల్, పంప్‌హౌస్ పనులను ఆఖిలపక్షం నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, హిందూపురం పార్లమెంట్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ, వైఎస్సార్ సీపీ రాయలసీమ రైతు విభాగం ఇన్చార్జ్ శరత్‌చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజారాం, కదలిక ఎడిటర్ ఇమామ్, కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు రమణ తదితరులు మాట్లాడారు. దోపిడీకి తెరలేపిన సీఎం, మంత్రులు నయా పైసా ఖర్చు లేకుండా పేరూరు డ్యాంకు హంద్రీ–నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను తీసుకెళ్లవచ్చునని తెలిపారు. అయితే ఈ విషయాన్ని బయటపెట్టకుండా పేరూరు డ్యాంకు నీటిని అందించే మిషతో రూ. 1,020 కోట్ల భారీ దోపిడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు తెరలేపారని ఆరోపించారు. ఈ దోపిడీని అడ్డుకుంటామని అన్నారు. జిల్లాకు హంద్రీ–నీవా ద్వారా కృష్ణ జలాలను తీసుకువచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని గుర్తు చేశారు. ఈ విషయాన్ని తెరమరుగు చేసేందుకు సీఎం చంద్రబాబు కుట్రలు సాగిస్తూ.. కృష్ణాజలాలను తామే ఈ జిల్లాకు తెచ్చినట్లు గొప్పలకు పోతుండడం సిగ్గుచేటన్నారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వాస్తవాలను కనుమరుగు చేస్తూ కావాలనే హంద్రీ–నీవా పనుల్లో సీఎంతో మొదలు జిల్లా మంత్రులు ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. సాగునీరు లభ్యం కాక ఈ ప్రాంత రైతాంగం కర్ణాటక, కేరళ ప్రాంతాలకు వలస పోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ పెద్దల అవినీతిపై ప్రజలను చైతన్య పరిచి, దోపిడీని అడ్డుకుంటామని అన్నారు. పనులు పరిశీలించిన అఖిలపక్షం మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరుగుతున్నాయనే విషయాన్ని పరిశీలించేందుకు అఖిలపక్షం శనివారం కెనాల్‌పై పర్యటించింది. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి విడుదలయ్యే నీరు ఎక్కడికెళ్లే అవకాశముందనే విషయంపై సభ్యులు అధ్యయనం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర లీగల్‌సెల్ జనరల్ సెక్రెటరీ నాగిరెడ్డి, మండల కన్వీనర్ బి.నారాయణరెడ్డి, పెనుకొండ కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, వాల్మీకి సేవాదళ్ ఐటీవింగ్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్, జెడ్పీప్లోర్ లీడర్ బిల్లే ఈశ్వరయ్య, జెడ్పీటీసీ సభ్యుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్, సర్పంచ్ సుధాకర్‌రెడ్డి మండల సీపీఎం కార్యదర్శి ముత్యాలప్ప, డీసీసీ సభ్యుడు నగరూరు నారాయణరెడ్డి, సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
పంపుహౌస్ ముట్టడి : ఎమ్మెల్యే అరెస్ట్
అనంతపురం : కరువు ప్రాంతాలను సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే నేతృత్వంలో సోమవారం రైతులు రాగులపాడు పంపుహౌస్ కార్యాలయాన్ని ముట్టడించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డితో సహా పలువురు రైతులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ...హంద్రీనీవా మొదటి దశ వైఎస్ఆర్ హయాంలోనే పూర్తయినా..ఇప్పటి వరకు పంటపొలాలకు నీరు విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హంద్రీనీవాకు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. -
హంద్రినీవా కాలువలో పడి మహిళ మృతి
హిందూపురం (అనంతపురం జిల్లా) : హిందూపురం మండలం బెవినహల్లి గ్రామం వద్ద ప్రమాదవశాత్తూ హంద్రినీవా కాలువలో పడి చౌడమ్మ(35) అనే మహిళ మృతి చెందింది. ఆదివారం ఉదయం బట్టలు ఉతుకుతుండగా కాలుజారడంతో ఆమె హంద్రినీవా కాలువలో పడిపోయింది. దగ్గర ఎవరూ లేకపోవడంతో కాసేపటికే మునిగి చనిపోయింది. గ్రామస్తులు చౌడమ్మ మృతదేహాన్ని వెలికితీశారు. -
జీడిపల్లి ఘటనపై విచారణకు ఆదేశించిన కలెక్టర్
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం జీడిపల్లిలో సంభవించిన భూ ప్రకంపనలపై జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ స్పందించారు. భూ ప్రకంపనలపై విచారణ జరపాలని కల్యాణదుర్గం ఆర్దీవోను ఆదేశించారు. విచారణ జరిపి నివేదికను సాధ్యమైనంత త్వరగా అందజేయాలని కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలలో ఆర్డీవోకు సూచించారు. జీడిపల్లి పరిసర ప్రాంతాలలో ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించడంతోపాటు భారీ శబ్దాలు వెలువడ్డాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే హంద్రీ నీవా కాల్వ పనులలో భాగంగా కాంట్రాక్టర్ భారీగా మందుగుండు సామాగ్రి పేల్చారని అందువల్లే భూమి కంపించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాంతో భూ ప్రకంపనలపై వెంటనే నివేదిక అందజేయాలని కల్యాణదుర్గం ఆర్డీవోను కలెకర్ట్ లోకేష్ కుమార్ ఆదేశించారు. -
అనంతలో భూ ప్రకంపనలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామ పరిసరాలలో భూ ప్రకంపనలు సంభవించటంతోపాటు భారీ శబ్దాలు వెలువడ్డాయి. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురైయ్యారు. ఇళ్లలో నుంచి స్థానికులు బయటకు పరుగులు తీశారు. హంద్రీ నీవా కాల్వ పనులలో భాగంగా తవ్వకాలు చేపట్టారు. అందులోభాగంగా కాంట్రాక్టర్ భారీ మందుగుండు సామాగ్రిని పేల్చడంతో భూ ప్రకంపనలు సంభవించడంతోపాటు భారీ శబ్దాలు వెలువడ్డాయని అధికారులు వెల్లడించారు. -
హంద్రీనీవా కెనాల్లో దూసుకెళ్లిన స్కూల్ బస్సు