billion deal
-
నోకియాకు ఎయిర్టెల్ నుంచి భారీ ఆర్డర్
న్యూఢిల్లీ: టెలికం పరికరాల తయారీలో ఉన్న ఫిన్లాండ్ దిగ్గజం నోకియా తాజాగా భారతీ ఎయిర్టెల్ నుండి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. ఇందులో భాగంగా భారత్‌లోని ముఖ్య నగరాలు, రాష్ట్రాలలో నోకియా తయారీ 4జీ, 5జీ పరికరాలను వినియోగంలోకి తెస్తారు. రీఫ్షార్క్ సిస్టమ్ ఆన్ చిప్ టెక్నాలజీ ఆధారిత బేస్ స్టేషన్స్, బేస్‌బ్యాండ్ యూనిట్స్, మాసివ్ మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ ఔట్పుట్ వైర్లెస్ కమ్యూనికేషన్స్‌ను నోకియా అందించనుంది.‘వీటి చేరికతో ఎయిర్టెల్ నెట్‌వర్క్‌ను అసాధారణమైన 5జీ సామర్థ్యం, కవరేజీతో మెరుగుపరుస్తాయి. అలాగే నెట్వర్క్ వికాసానికి మద్దతు ఇస్తాయి. ఎయిర్టెల్ యొక్క ప్రస్తుత 4జీ నెట్‌వర్క్‌ను మల్టీబ్యాండ్ రేడియోలు, బేస్‌బ్యాండ్ పరికరాలతో నోకియా ఆధునీకరించనుంది. ఇది 5జీకి కూడా మద్దతు ఇస్తుంది’ అని నోకియా వెల్లడించింది.నోకియాతో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం సంస్థ నెట్వర్క్ మౌలిక సదుపాయాల సామర్థాన్ని రుజువు చేస్తుందని భారతీ ఎయిర్టెల్ వైస్ చైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ ఈ సందర్భంగా తెలిపారు. వినియోగదారులకు అసమానమైన అనుభవాన్ని అందిస్తుందని, ఈ నెట్వర్క్ పర్యావరణ అనుకూలమైనదని వివరించారు. ఎయిర్‌టెల్‌కు రెండు దశాబ్దాలకుపైగా సేవలు అందిస్తూ 2జీ, 3జీ, 4జీ, 5జీ నెట్వర్క్ ఉపకరణాలను నోకియా సరఫరా చేస్తోంది. -
ఇన్ఫోసిస్‌కి భారీ షాక్! రూ.12 వేల కోట్ల డీల్ క్యాన్సిల్
దేశీయ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కి భారీ షాక్ తగిలింది. గ్లోబల్ కంపెనీతో చేసుకున్న సుమారు రూ.12 వేల కోట్ల డీల్ క్యాన్సిల్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ కోసం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (MOU) సదరు కంపెనీ రద్దు చేసుకుందని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ భారీ ఒప్పందం ఈఏడాది సెప్టెంబర్‌లో ఖరారైంది. 15 సంవత్సరాల కాలానికి చేసుకున్న ఈ డీల్ ప్రారంభంలోనే ముగిసిపోవడం ఐటీ సేవల రంగంలో క్లయింట్ల డిమాండ్, సాంకేతిక బడ్జెట్లలో పెరుగుతున్న అనిశ్చితిని తెలియజేస్తోంది. ఇదీ చదవండి: ...అలా విజయం సాధించినట్లు చరిత్రలో లేదు “గ్లోబల్ కంపెనీతో ఎంఓయూకి సంబంధించి 'కంపెనీ అప్డేట్' పేరుతో 2023 సెప్టెంబర్ 14 నాటి ఇన్ఫోసిస్ ప్రకటనకు ఇది కొనసాగింపు. గ్లోబల్ కంపెనీ ఇప్పుడు ఎంవోయూను రద్దు చేయడానికి నిర్ణయించింది. దీంతో ఇరు పక్షాలు మాస్టర్ అగ్రిమెంట్‌ను అనుసరించడం లేదు” అని కంపెనీ డిసెంబర్ 23న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. సీఎఫ్‌వో రాజీనామా చేసిన రెండు వారాల్లోనే.. కంపెనీ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ ఆకస్మికంగా వైదొలిగిన రెండు వారాల లోపే ఈ భారీ డీల్ క్యాన్సిల్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ మెరుగైన డిజిటల్ సేవలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అందించడానికి గ్లోబల్ కంపెనీతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు సెప్టెంబర్ 14న ప్రకటించింది. -
Microsoft-Amazon Deal: రెండు టెక్ దిగ్గజాలు పోటీని పక్కన పెట్టి.. భారీ ఒప్పందం!
రెండు బలమైన టెక్ దిగ్గజాలు పోటీని పక్కన పెట్టి పరస్పరం సహకరించుకునేందకు సిద్ధమయ్యాయి. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం.. మైక్రోసాఫ్ట్ (Microsoft) దాని క్లౌడ్ ఆధారిత 365 ఉత్పాదకత సూట్ కోసం అమెజాన్ (Amazon.com)ని ముఖ్యమైన క్లయింట్‌గా స్వాగతించడానికి సిద్ధమైంది. 1 బిలియన్ డాలర్ల (రూ.83 వేల కోట్లకు పైగా ) కంటే ఎక్కువ విలువైన ఈ ఒప్పందం ఇద్దరు టెక్ దిగ్గజాలకు ఒక మైలురాయిని సూచిస్తోంది. సాధారణంగా బలమైన పోటీదారులుగా ఉండే ఈ రెండు కంపెనీలు ఇలా సహకరించుకోవడం టెక్నాలజీ పరిశ్రమలో సరికొత్త ఒరవడికి నాంది పలుకుతోంది. ఐదేళ్లకు మించి ఉండే ఈ ఒప్పందం కోసం అమెజాన్.. మైక్రోసాఫ్ట్‌కు భారీ మొత్తాన్ని కట్టబెట్టనుందని నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ 365 కోసం అమెజాన్ పది లక్షలకు పైగా లైసెన్స్‌లను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత, మైక్రోసాఫ్ట్ షేర్ ధర 1 శాతం మేర పెరిగింది. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి మైక్రోసాఫ్ట్ నిరాకరించింది. మరో వైపు అమెజాన్ కూడా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నివేదిక ప్రకారం, నవంబర్ ప్రారంభంలో ఈ కొత్త సిస్టమ్‌లను ఏకీకృతం చేయడం ప్రారంభించాలని అమెజాన్ భావిస్తోంది. అమెజాన్ ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (Microsoft Office) ఉత్పత్తుల స్థానిక, ఆన్-సైట్ వెర్షన్‌ను ఉపయోగిస్తోంది. అమెజాన్ కొత్త సిస్టమ్‌ల ఇన్‌స్టాలేషన్‌ను నవంబర్‌లో ప్రారంభించలనుకుంటుండగా ఏఐ సామర్థ్యాలతో అప్‌గ్రేడ్ చేసిన మైక్రోసాఫ్ట్ 365 (Microsoft 365) సూట్‌ను కూడా ఇదే నెలలో ప్రారంభించనుండటం గమనార్హం. -
ట్విటర్-మస్క్ వార్: ‘అయ్యో రామ ఇదేం విచిత్రం’!
సాక్షి,న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ 44 బిలియన్ డాలర్ల కొనుగోలు డీల్ రద్దుపై ఊహించినట్టుగానే న్యాయ పోరాటానికి దిగింది ట్విటర్. టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ మంగళవారం దావా వేసింది. ప్రతీ ట్విటర్ షేర్‌కు అంగీకరించిన 54.20 డాలర్ల చొప్పున విలీనాన్ని పూర్తి చేయాలని ఆదేశించాలని డెలావేర్ కోర్టును ఆశ్రయించింది. సెప్టెంబర్ మధ్యలో నాలుగు రోజుల విచారణనుషెడ్యూల్ చేయాలని కూడా ట్విటర్ కోర్టును కోరింది. మస్క్ ఆరోపణలను కుంటిసాకులు మాత్రమేనని కొట్టిపారేసిన ట్విటర్, రెగ్యులేటర్లకు సమాచారం లేకుండానే జనవరి-మార్చి మధ్య కంపెనీలో "రహస్యంగా" షేర్లను పోగు చేసుకున్నాడని ఆరోపించింది. అంతేకాదు ఈ సందర్బంగా ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ఉద్యోగులకు కంపెనీ భవిష్యత్తుపై భరోసా ఇచ్చారు. కోర్టు విజయం తమదే, ఆందోళన అవసరం లేదంటూ వారికి ఒక లేఖ రాశారు. ఇది కూడా చదవండి : Elon Musk: ట్విటర్ గుర్రు: పగలబడి నవ్వుతున్న మస్క్ అయితే ట్విటర్ న్యాయపోరాటంపై ఇప్పటికే విభిన్నంగా స్పందించిన మస్క్ మరోసారి ట్విటర్లో వ్యంగ్యంగా స్పందించారు. ట్విటర్ దావా గురించి ప్రస్తావించకుండానే ‘‘అయ్యో రామ..ఇదేం విచిత్రం (Oh the irony lol)’’ అన్నట్టుగా ట్వీట్ చేశారు. కాగా ఫేక్, స్పామ్ అకౌంట్ల సమాచారం ఇవ్వడంలో ట్విటర్ వైఫల్యం కారణంగానే డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్టు గతవారం మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. Oh the irony lol — Elon Musk (@elonmusk) July 12, 2022 -
గ్రేట్ లెర్నింగ్.. ఇకపై బైజూస్ ఆధ్వర్యంలో
ఇండియాలో మోస్ట్ పాపులర్ ఎడ్యుకేషనల్ యాప్‌గా పేరొందిన బైజూస్ తన సేవలను మరింతగా విస్తరించనుంది. ఇప్పటి వరకు అకడామిక్ ఓరియెంటెండ్ సర్వీసెస్‌పై ఎక్కువగా ఫోకస్ చేయగా.. రాబోయే రోజుల్లో ప్రొఫెషనల్, సర్టిఫికేట్ కోర్సులపై కూడా దృష్టి సారించనుంది. అందులో భాగంగా గ్రేట్లెర్నింగ్ను స్వంతం చేసున్నట్టు ప్రకటించింది. బిలియన్ డాలర్లు ఉన్నత విద్యకు సంబంధఙంచి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న గ్రేట్ లెర్నింగ్‌ను బైజూస్ సొంతం చేసుకోనుంది. సుమారు 600 మిలియన్ డాలర్లతో గ్రేట్ లెర్నింగ్‌ను కొనుగోలు చేసింది. అంతేకాదు హైయ్యర్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన సెగ్మెంట్లో భారీగా విస్తరించేందుకు మరో 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. మొత్తంగా ఉన్నత విద్య, కెరీర్ స్కిల్ డెవలప్మెంట్ రంగంలో వన్ బిలియన్ డాలర్ల పెట్టుబడికి బైజూస్ సిద్ధమైంది. ఇండిపెండెంట్‌గానే బైజూస్ స్వంతం చేసుకున్నప్పటికీ గ్రేట్ లెర్నింగ్ యాప్‌ను ఇండిపెండెంట్‌గానే కొనసాగనుంది. బైజూస్ నేతృత్వంలో గ్రేట్ లెర్నింగ్ ఫౌండర్ మోహన్ లక్ష్మణరాజు, కో ఫౌండర్లు హరి నాయర్, అర్జున్ నాయర్లు గ్రేట్ లెర్నింగ్‌ను ఇకపై ముందుకు తీసుకెళ్లనున్నారు. పైగా బైజూస్ నుంచి భారీగా పెట్టుబడులు రానుండటంతో మరింత సమర్థంగా గ్రేట్ లెర్నింగ్‌ను తీర్చిదిద్దనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రేట్ లెర్నింగ్ ఆన్లైన్లో అందిస్తోంది. ఈ యాప్‌కు 15 లక్షల మంది వినియోగదారులు 170 దేశాల్లో ఉన్నారు. గ్రేట్లెర్నింగ్కి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీ, నేషనల్ యూనివర్సిటీ సింగపూర్, ఐఐటీ బొంబాయి వంటి ప్రముఖ సంస్థల సహాకారం అందిస్తున్నాయి. అవకాశాలు సృష్టిస్తాం గ్రేట్ లెర్నింగ్‌ను కొనుగోలు చేయడంపై బైజూస్ ఫౌండర్, సీఈవో బైజూ రవీంద్రన్ స్పందిస్తూ..‘ నేర్చుకోవడం, నేర్చుకోకపోవడం, తిరిగి నేర్చుకోవడం అనేవి ముఖ్యమైన నైపుణ్యాలు. మాకు ఎందులో అయితే ఎక్కడ నైపుణ్యం ఉందో అక్కడ అవకాశాలు సృష్టిస్తాం, కొత్త దారులు వేస్తాం. మాకు ఎక్కడ అనుభవం లేదో కూడా తెలుసు. అక్కడ అనుభవం ఉన్న వారితో అవకాశాలు సృష్టిస్తాం’ అంటూ పేర్కొన్నారు. -
ఈ–కామర్స్ @ మేడిన్ ఇండియా
భారీ దిగుమతి సుంకాల బెడద తప్పించుకునేందుకు, మేకిన్ ఇండియా నినాద ప్రయోజనాలను పొందేందుకు ఈ–కామర్స్ దిగ్గజాలు క్రమంగా భారత్‌లో తయారీపై దృష్టి పెడుతున్నాయి. ఇప్పటిదాకా సొంత బ్రాండ్స్ కోసం చైనా, మలేసియాపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్ కొన్నాళ్లుగా మేడిన్ ఇండియా ఉత్పత్తులవైపు మొగ్గుచూపుతోంది. దీంతో తమ ప్లాట్‌ఫాంపై విక్రయించే దాదాపు 300 కేటగిరీల ఉత్పత్తుల ధరలను గణనీయంగా తగ్గించగలిగామని కంపెనీ వెల్లడించింది. ‘‘రెండేళ్ల క్రితం దాకా దాదాపు 100 శాతం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు చైనా నుంచే వచ్చేవి. ప్రస్తుతం ఇది 50 శాతానికన్నా తక్కువకి పడిపోయింది. ఇక మా ఫర్నిచర్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టినప్పుడు మొత్తం శ్రేణిని మలేసియా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇది 50 శాతం కన్నా తక్కువే ఉంది’’ అని ఫ్లిప్‌కార్ట్ ప్రైవేట్ లేబుల్ బిజినెస్ విభాగం హెడ్ ఆదర్శ్ మీనన్ చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం మార్క్యూ, పర్ఫెక్ట్ హోమ్స్, బిలియన్, స్మార్ట్ బై మొదలైన ప్రైవేట్ బ్రాండ్స్‌ను విక్రయిస్తోంది. ఇవి కంపెనీ మొత్తం అమ్మకాల్లో 8 శాతం దాకా ఉంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, టెక్స్టైల్స్, ఆండ్రాయిడ్ టీవీలు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషీన్స్, చిన్న స్థాయి ఉపకరణాలు మొదలైనవాటిని దేశీయంగా సోర్సింగ్ చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దాదాపు 50–60 శాతం యాక్సెసరీలను కూడా భారత్ నుంచే సోర్సింగ్ చేస్తోంది. అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజాలను భారత్‌లో తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చిన్న వ్యాపారస్తుల నిరసనలు.. స్మార్ట్‌ఫోన్స్ దిగుమతులపై భారీగా సుంకాల వడ్డన ఉండటంతో యాపిల్ వంటి టెక్ దిగ్గజాలు తమ ఐఫోన్స్ తదితర ఖరీదైన ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేయడంపై దృష్టి పెడుతున్నాయి. ఫాక్స్‌కాన్, విస్ట్రన్ వంటి సంస్థలు వీటిని తయారు చేస్తున్నాయి. అమెజాన్ కూడా చాలా మటుకు ప్రైవేట్ లేబుల్స్‌ను భారత్‌లోనే రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. ఏసీలు, మొబైల్‌ఫోన్ యాక్సెసరీలు, నిత్యావసరాలు, గృహోపకరణాలు, ఆహారోత్పత్తులు తదితర ప్రైవేట్ లేబుల్స్ అమెజాన్‌కు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ దాదాపు 150 ఫ్యాక్టరీల నుంచి ఉత్పత్తులు సేకరిస్తుండగా.. వీటిలో 100 ఫ్యాక్టరీలు భారత్‌కి చెందినవేనని సంస్థ ప్రైవేట్ లేబుల్ వ్యాపార విభాగం హెడ్ మీనన్ పేర్కొన్నా రు. అయితే, విలువపరంగా చైనా, మలేసియాతో పోలిస్తే భారత ఉత్పత్తుల వాటా ఎంత ఉంటోందనేది మాత్రం తెలపలేదు. ఇలా సొంత ప్రైవేట్ లేబుల్స్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ప్రవేశపెడుతుండటాన్ని గత రెండేళ్లుగా చిన్న వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల వీటితో పోటీపడేందుకు తాము అసంబద్ధ స్థాయిలో ధరలను తగ్గించుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్ వంటి సంస్థలు సొంత ప్రైవేట్ లేబుల్స్ ఏర్పాటు చేసుకోకుండా నియంత్రిస్తూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను కేంద్రం గతేడాది డిసెంబర్లో మార్చినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ వివరణనివ్వడంతో ప్రైవేట్ లేబుల్స్‌కు కొంత వెసులుబాటు లభిస్తోంది. చిన్న సంస్థలకు తోడ్పాటు.. ధరలపరంగానో నాణ్యతపరంగానో చాలా వ్యత్యాసాలు ఉన్న ఉత్పత్తులకు సంబంధించి మాత్రమే ప్రైవేటు లేబుల్స్‌ను ప్రవేశపెడుతున్నామని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పేర్కొన్నాయి. మరోవైపు, వాల్‌మార్ట్‌కి చెందిన పలు ప్రైవేట్ లేబుల్స్ కూడా భారత్‌లో తయారవుతున్నాయని, ఇది తయారీ భాగస్వామ్య సంస్థలకు తోడ్పాటుగా ఉంటోందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ప్రైవేట్ బ్రాండ్స్ వ్యాపారం ద్వారా ఇటు దేశీ తయారీ సంస్థలు, ఉత్పత్తిదారులు .. ముఖ్యంగా లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల వృద్ధికి, నవకల్పనల ఆవిష్కరణలకు మరింత మద్దతు లభిస్తోందని ఫ్లిప్‌కార్ట్ వర్గాలు తెలిపాయి. -
అమెరికాతో భారత్ భారీ ఒప్పందం
న్యూఢిల్లీ: నాలుగు నిఘా విమానాల కొనుగోలు కోసం అమెరికాతో భారత్ బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 6,700 కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది. దీర్ఘశ్రేణి సముద్ర నిఘా వ్యవస్థ కలిగిన, జలాంతర్గామి విధ్వంసక యుద్ధ విమానాలు ‘పోసిడాన్-8ఐ’(పీ-8ఐ)లను కొనేందుకు అమెరికా రక్షణ శాఖ, విమానాల తయారీ సంస్థ బోయింగ్‌తో దీన్ని కుదుర్చుకుంది. ఇప్పటికే ఎనిమిది పీ-8ఐలను భారత్ కొన్నదని. ఇప్పుడు మరో నాల్గింటిని కొంటోందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. మరో 145 తేలికపాటి ‘ఎం777’ శతఘ్నులను కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది 22 ఆపాచి, 15 చినూక్ హెలికాప్టర్ల కొనుగోలు కోసం 3 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. రక్షణ రంగానికి సంబంధించి తాజా ఒప్పందంతో కలిపి గత పదేళ్లలో మొత్తం 15 బిలియన్ డాలర్ల ఒప్పందాలను అమెరికాతో భారత్ కుదుర్చుకుంది.