రెండు బలమైన టెక్ దిగ్గజాలు పోటీని పక్కన పెట్టి పరస్పరం సహకరించుకునేందకు సిద్ధమయ్యాయి. బిజినెస్ ఇన్‌సైడర్ ప్రకారం.. మైక్రోసాఫ్ట్ (Microsoft) దాని క్లౌడ్ ఆధారిత 365 ఉత్పాదకత సూట్ కోసం అమెజాన్ (Amazon.com)ని ముఖ్యమైన క్లయింట్‌గా స్వాగతించడానికి సిద్ధమైంది.
1 బిలియన్ డాలర్ల (రూ.83 వేల కోట్లకు పైగా ) కంటే ఎక్కువ విలువైన ఈ ఒప్పందం ఇద్దరు టెక్ దిగ్గజాలకు ఒక మైలురాయిని సూచిస్తోంది. సాధారణంగా బలమైన పోటీదారులుగా ఉండే ఈ రెండు కంపెనీలు ఇలా సహకరించుకోవడం టెక్నాలజీ పరిశ్రమలో సరికొత్త ఒరవడికి నాంది పలుకుతోంది.
ఐదేళ్లకు మించి ఉండే ఈ ఒప్పందం కోసం అమెజాన్.. మైక్రోసాఫ్ట్‌కు భారీ మొత్తాన్ని కట్టబెట్టనుందని నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ 365 కోసం అమెజాన్ పది లక్షలకు పైగా లైసెన్స్‌లను కొనుగోలు చేయాలని భావిస్తోంది.
ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత, మైక్రోసాఫ్ట్ షేర్ ధర 1 శాతం మేర పెరిగింది. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి మైక్రోసాఫ్ట్ నిరాకరించింది. మరో వైపు అమెజాన్ కూడా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
నివేదిక ప్రకారం, నవంబర్ ప్రారంభంలో ఈ కొత్త సిస్టమ్‌లను ఏకీకృతం చేయడం ప్రారంభించాలని అమెజాన్ భావిస్తోంది. అమెజాన్ ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (Microsoft Office) ఉత్పత్తుల స్థానిక, ఆన్-సైట్ వెర్షన్‌ను ఉపయోగిస్తోంది. అమెజాన్ కొత్త సిస్టమ్‌ల ఇన్‌స్టాలేషన్‌ను నవంబర్‌లో ప్రారంభించలనుకుంటుండగా ఏఐ సామర్థ్యాలతో అప్‌గ్రేడ్ చేసిన మైక్రోసాఫ్ట్ 365 (Microsoft 365) సూట్‌ను కూడా ఇదే నెలలో ప్రారంభించనుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment