హెచ్ఎండీ గ్లోబల్ త్వరలో నోకియా 5.4 అనే కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుందని వార్తలు జోరుగా వస్తున్నాయి. గతంలో లాంచ్ అయిన నోకియా 5.3కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ రానుంది. నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ వీ10 (క్యూ) ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. దీనిలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్లు రానున్నట్లు సమాచారం. ఈ సంవత్సరం చివరిలో బ్లూ, పర్పుల్ కలర్ ఆప్షన్లతో ఈ ఫోన్లు రానున్నట్లు సమాచారం.(చదవండి: ఒప్పో నుండి మరో సూపర్ మొబైల్)
నోకియా 5.4 ఫీచర్స్
దీనిలో 6.4 అంగుళాల హోల్ పంచ్ డిస్ ప్లేను అందించనున్నారు. దీనిలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్లు రానున్నట్లు సమాచారం. నోకియా 5.3 మాదిరిగానే నోకియా 5.4లో 13 ఎంపీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ కెమెరా, 5 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్, 2 ఎంపీ మాక్రో కెమెరాతో రానుంది. సెల్ఫీ కోసం 16 మెగా పిక్సల్ కెమెరా తీసుకురానున్నట్లు సమాచారం. దీనిలో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. అలాగే ఈ మొబైల్ గూగుల్ ఎఆర్ కి కూడా సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్ రెండు ఆస్ట్రేలియన్ రిటైల్ వెబ్ సైట్లలో కనిపించింది. దాని ప్రకారం 350 ఆస్ట్రేలియన్ డాలర్లుగా(సుమారు రూ.19,000) ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment