ఆపిల్ ఇండియా హెడ్ ఆశిష్ చౌదరి (ఫైల్ ఫోటో)
ప్రముఖ టెక్ సంస్థ, ఐ ఫోన్ తయారీదారు ఆపిల్ సంస్థ ఇండియాలో కొత్త బాస్‌గా అశిష్ చౌదరి ఎంపికయ్యారు. నోకియా సంస్థలో చీఫ్ కస్టమర్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా ఉన్న ఆశిష్‌ను ఇండియా ఆపరేషన్స్ హెడ్‌గా నియమించింది ఆపిల్. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు.
భారతీయ మార్కెట్‌పై కన్నేసిన ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఆపిల్ సీఈవో టిమ్ కుక్ భారత్‌కు చెందిన ప్రముఖ వ్యక్తికి ఆపిల్ ఇండియా పగ్గాలు అప్పగించారు. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో నోకియా లీడర్‌షిప్ టీంలో మార్పులను చేపట్టనుంది. పదిహేనేళ్ల విజయవంతమైన ప్రయాణం తర్వాత చౌదరి ఈ ఏడాది చివరికి ఆయన కంపెనీని వీడనున్నారని నోకియా మంగళవారం ప్రకటించింది.
చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా నోకియా అమ్మకాలు, కార్యకలాపాలకు ప్రపంచవ్యాప్తంగా బాధ్యత వహించిన ఆశిష్ చౌదరి నోకియా పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు. వ్యాపార, టెలికాం రంగాల్లో 25 సంవత్సరాల అనుభవం ఆయన సొంతం. కాగా 2018 క్యూ4 లో ఇండియాలో ఆపిల్‌కు డిమాండ్ గణనీయంగా క్షీణించినప్పటికీ భవిష్యత్ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నియామకాన్ని చేపట్టారని మార్కెట్ వర్గాల విశ్లేషణ.
Comments
Please login to add a commentAdd a comment