India Head
-
వివాదాస్పద ఫేస్బుక్ ఎగ్జిక్యూటివ్ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్ ఇండియా వివాదాస్పద పాలసీ హెడ్ అంఖిదాస్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఫేస్బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండియాలో మొదటి ఉద్యోగి అయిన అంఖి దాదాపు 9 సంవత్సరాల పాటు భారత, సౌత్, సెంట్రల్ ఆసియా ప్రాంతాల వృద్ధిలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సేవకు కృతజ్ఞతలు ప్రకటించారు. బిహార్ ఎన్నికల్లో ఈ పార్టీకి ఫేవర్ గా కంపెనీ మోడరేషన్ పాలసీని అంఖిదాస్ రూపొందించినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆమె రాజీనామాకు, ఈ వివాదానికి సంబంధం లేదని, అంఖిదాస్ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో తనకు తానే స్వయంగా ఈ పదవినుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారని అజిత్ మోహన్ స్పష్టం చేశారు. బీజేపీకి అనుకూలంగా ఆపార్టీ నేతల ద్వేష పూరిత ప్రసంగాల పట్ల చూసీచూడనట్టు వ్యవహరిస్తోందన్న ఆరోపణలతో అంఖిదాస్ వివాదంలో పడిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆమె త్వరలోనే బీజేపీలో చేరవచ్చనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అంతేకాదు రానున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో అంఖిదాస్ నిలిచే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు. ప్రజా సేవపై ఆసక్తి చూపడం అంటే 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు బీజేపీ టికెట్ పొందడమే? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటూ ఆమె ట్వీట్ చేశారు. కాగా బీజేపీ నేతల ప్రసంగాలను ఫేస్ బుక్ చూసీ చూడనట్టు వదిలేస్తోందని గత ఆగస్టులో ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక ఆర్టికల్ ప్రచురించింది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అలాగే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వాన గల పార్లమెంటరీ కమిటీ కూడా పలు భద్రతా అంశాలపై ఫేస్ బుక్ ప్రతినిధులను ప్రశ్నించింది. -
ఆపిల్ ఇండియా కొత్త బాస్ ఈయనే
ప్రముఖ టెక్ సంస్థ, ఐ ఫోన్ తయారీదారు ఆపిల్ సంస్థ ఇండియాలో కొత్త బాస్‌గా అశిష్ చౌదరి ఎంపికయ్యారు. నోకియా సంస్థలో చీఫ్ కస్టమర్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా ఉన్న ఆశిష్‌ను ఇండియా ఆపరేషన్స్ హెడ్‌గా నియమించింది ఆపిల్. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. భారతీయ మార్కెట్‌పై కన్నేసిన ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఆపిల్ సీఈవో టిమ్ కుక్ భారత్‌కు చెందిన ప్రముఖ వ్యక్తికి ఆపిల్ ఇండియా పగ్గాలు అప్పగించారు. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో నోకియా లీడర్షిప్ టీంలో మార్పులను చేపట్టనుంది. పదిహేనేళ్ల విజయవంతమైన ప్రయాణం తర్వాత చౌదరి ఈ ఏడాది చివరికి ఆయన కంపెనీని వీడనున్నారని నోకియా మంగళవారం ప్రకటించింది. చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా నోకియా అమ్మకాలు, కార్యకలాపాలకు ప్రపంచవ్యాప్తంగా బాధ్యత వహించిన ఆశిష్ చౌదరి నోకియా పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు. వ్యాపార, టెలికాం రంగాల్లో 25 సంవత్సరాల అనుభవం ఆయన సొంతం. కాగా 2018 క్యూ4 లో ఇండియాలో ఆపిల్‌కు డిమాండ్ గణనీయంగా క్షీణించినప్పటికీ భవిష్యత్ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నియామకాన్ని చేపట్టారని మార్కెట్ వర్గాల విశ్లేషణ. -
రూ.14 కోట్ల జాబ్‌కు ఎవరూ ముందుకురారే...
న్యూఢిల్లీ : ఫేస్బుక్, వాట్సాప్ ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లు భారత్ చాలా పాపులర్. యువత ప్రతి ఒక్కరూ ఈ సోషల్ మీడియా దిగ్గజాలను వాడుతుంటారు. ఈ రెండింటికి కలిపి భారత్‌లో 57 కోట్లకు పైగానే యూజర్లు ఉన్నారు. అంటే అమెరికా కంటే భారత్‌లోనే ఈ ప్లాట్‌ఫామ్‌లకు యూజర్లు ఎక్కువ. ఇంత ఫేమస్ అయిన ఈ కంపెనీల్లో టాప్ పోస్టును అలకరించడానికి సీనియర్-లెవల్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతుంటారు. కానీ భారత్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఫేస్బుక్, వాట్సాప్‌లకు భారత్‌లో అధినేతలు దొరకడం లేదు. దొరకడం లేదు కాదు, ఎవరూ ఈ పదవిని అలంకరించడానికి ముందుకు రావడం లేదు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు ఇటీవల భారత్‌లో ఆంక్షలు పెరిగిపోయాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నకిలీ న్యూస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని, ఈ వార్తలతో బాగా మూకదాడులు జరుగుతున్నాయంటూ.. ప్రభుత్వం ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లకు కఠిన హెచ్చరికలే జారీ చేసింది. అంతేకాక ఈ ప్లాట్‌ఫామ్‌లపై కఠిన ఆంక్షలే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ఈ కంపెనీలకు టాప్ ప్రతినిధులు దొరకడం లేదు. ఫేస్బుక్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంటున్న ఉమాంగ్ బేడి 2017 అక్టోబర్‌లో రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెటింగ్ సొల్యుషన్స్ హెడ్ సందీప్ భూషణ్ ఆ పదవిని తాత్కాలికంగా అలకరించారు. కానీ కొత్త వారిని నియమించడం ఆ కంపెనీకి కష్టంగా మారింది. ఎండీ పదవి, వైస్-ప్రెసిడెంట్ పోస్ట్‌తో సమానం. అంటే స్టాక్ ఆప్షన్లతో కలిపి, వార్షికంగా రూ.14 కోట్లకు పైగా పరిహారాలు పొందుతారు. కానీ కోట్లు ఆఫర్ చేస్తున్న భారత్‌లో ఈ కంపెనీలకు ఎండీ పదవిని చేపట్టేందుకు ఏ సీనియర్ లెవల్ ఎగ్జిక్యూటివ్ ముందుకు రావడం లేదని తెలిసింది. ఫేస్బుక్ ప్రస్తుతం స్టార్ ఇండియా ఎండీ సంజయ్ గుప్తా, టాటా స్కై ఎండీ హరిత్ నాగ్‌పాల్, హాట్‌స్టార్ సీఈవో అజిత్ మోహన్ల పేర్లను పరిశీలిస్తోంది. వీరిలో ఒకరిని ఖరారు చేయాలని ఫేస్బుక్ భావిస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంత వరకు విజయవంతం అవుతుందో వేచిచూడాలి. అంతేకాక, ఫేస్బుక్లో మొత్తంగా డజనుకు పైగా సీనియర్-లెవల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటు వాట్సాప్‌కు కూడా భారత్ హెడ్‌ను నియమించడం క్లిష్టంగా మారింది. ఇప్పటికే వాట్సాప్‌లో తప్పుడు సమాచారంతో బాగా దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వం మండిపడుతోంది. వాట్సాప్ ఇప్పటి వరకు భారత్‌లో ఎందుకు గ్రీవియెన్స్ ఆఫీసర్ నియమించలేదో సమాచారం చెప్పాలంటూ ప్రభుత్వానికి, ఆ కంపెనీకి సుప్రీం కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. -
బాస్ కోసం ఎఫ్బీ వేట..
సాక్షి, న్యూఢిల్లీ : గత ఏడాది నవంబర్ నుంచి బాస్ లేకుండా కార్యకలాపాలు సాగిస్తున్న ఫేస్బుక్ ఇండియా బృందానికి త్వరలోనే కొత్త సారథి నేతృత్వం వహించనున్నారు. ఎండీ ఉమాంగ్ బేడీ సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసేందుకు సంస్థను వీడటంతో అప్పటినుంచి ఫేస్బుక్ భారత టీం కెప్టెన్ లేకుండానే నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో ఫేస్బుక్ భారత్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఇండియా హెడ్ కోసం కంపెనీ వేట సాగిస్తోంది. కంట్రీ హెడ్‌ను నియామకంతో పాటు టాప్మేనేజ్మెంట్ బృందంలో మార్పులు చేసేందుకు ఫేస్బుక్ సంసిద్ధమైంది. మరోవైపు ఫేస్బుక్ ఇండియా హెడ్ కోసం ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకోని ఇంటర్వ్యూలకూ హాజరయ్యారు. వీరిలో హాట్‌స్టార్ సీఈఓ అజిత్ మోహన్, టాటా స్కై సీఈవో హరిత్ నాగ్‌పాల్, స్టార్ ఇండియా ఎండీ సంజయ్ గుప్తా, కర్ణాటక మాజీ ఐటీ కార్యదర్శి శ్రీవత్స కృష్ణలు ఉన్నారు. అయితే ఇండియా హెడ్ ఎంపికపై ఎఫ్బీ ప్రయత్నాలు ఇంకా ఓ కొలిక్కిరాలేదు. -
ఫేస్ బుక్ పై కోపమా.. ట్రాయ్ పై అసహనమా?
న్యూఢిల్లీ: భారత్‌లో యూజర్లకు ఫ్రీ బేసిక్స్ ఇకపై అందుబాటులో ఉండదని ఫేస్బుక్ ప్రతినిధి అధికారికంగా వెల్లడించారు. ఆ మరుసటిరోజే.. తాను అమెరికాకు వెళ్లిపోతున్నానని భారత్ లో ఫేస్ బుక్ చీఫ్ గా పనిచేస్తున్న కీర్తిగా రెడ్డి ప్రకటించారు. అమెరికా నుంచి భారత్ వచ్చేటప్పుడే అనుకున్నాం.. ఏదో ఓ రోజు మా కుటుంబం మళ్లీ అమెరికాకు తిరిగి వెళ్తుందని తెలుసునని పేర్కొన్నారు. ఏడాదిలోగా మళ్లీ భారత్ వచ్చే అవకాశం లేదని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎమర్జింగ్ మార్కెట్స్ (ఏపీఏసీ) విలియమ్ ఈస్టన్, డాన్ నియరీ, వీపీ ఆసియా పసిఫిక్ గా ఉన్న ఆమె కీర్తికాతో కలిసి ఫేస్ బుక్ లో పనిచేశారు. తన తర్వాత విలియమ్ ఈస్టన్ తన స్థానంలో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని పోస్ట్ లో తెలిపారు. 'భారత్ లో ఫేస్ బుక్ తొలి ఉద్యోగిగా ఉన్నాను, ఆరేళ్లుగా ఇక్కడ పనిచేశాను. సంస్థ అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటూ హైదరబాద్ నుంచి వ్యాపార కార్యకలాపాలను నిర్వహించాను' అని వివరించారు. మెన్లో పార్క్ లో ఫేస్ బుక్ కొత్త అవకాశాల కోసం పనిచేస్తానన్నారు. డేటా చార్జీల ప్రసక్తి లేకుండా నిర్దిష్ట వెబ్సైట్లను ఉచితంగా అందించేలా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో కలిసి ఫేస్బుక్ తలపెట్టిన ఈ సర్వీసులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కంటెంట్‌ను బట్టి చార్జీలు విధించడం సరికాదంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేయగా, ట్రాయ్ కూడా ఇందుకు అనుకూలంగా నిబంధనలు ప్రకటించింది. వివాదాస్పదమైన తమ ఫ్రీ బేసిక్స్ సర్వీసులను భారత్‌లో నిలిపివేయాలని ఫేస్బుక్ నిర్ణయించింది. ఆ మరుసటి రోజే భారత్ లో ఆ సంస్థ ముఖ్య అధికారిణి, డైరెక్టర్ కీర్తిగా రెడ్డి అమెరికాకు తిరిగి వెళ్లనున్నట్లు ప్రకటించారు. -
క్యాప్‌జెమిని ఇండియా హెడ్ శ్రీనివాస్ కందుల
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ ఐటీ సర్వీసెస్ సంస్థ క్యాప్‌జెమిని భారత్ కార్యకలాపాల సీఈవోగా శ్రీనివాస్ కందుల నియమితులయ్యారు. ఇంతవరకు సీఈవోగా వ్యవహరించిన అరుణ్ జయంతి ఇక నుంచి గ్రూప్‌కు సంబంధించిన అంతర్జాతీయ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. శ్రీనివాస్ కందుల తన కెరీర్‌ను ఐగేట్‌లో (2007)ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ స్థాయి నుంచి ప్రారంభించారు. క్యాప్‌జెమినిలో ఐగేట్ విలీన ప్రక్రియలో శ్రీనివాస్ కందుల కీలక ప్రాత పోషించారు.