
నోకియా ఎక్స్ సిరీస్ లలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతోందా? తాజా రూమర్లు ఈ ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఎక్స్ సిరీస్‌కు కొనసాగింపుగా ఎక్స్ 7 త్వరలో భారత్ సహా ఇతర మార్కెట్లలో విడుదల కానుందనే అంచనాలు భారీగా మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. దీనికి తోడు నోకియా తైవాన్ ఫేస్‌బుక్‌లో ఒక టీజర్‌ను రిలీజ్ చేసింది(ప్రస్తుతం ఈ పోస్ట్‌ను తొలగించింది) దీని ప్రకారం అయిదు రియర్ కెమెరాలు సహా, ఇతర అద్భుత ఫీచర‍్లతో నోకియా ఎక్స్ 7 రానుందనే అంచనాలు షికార్లు చేస్తున్నాయి. గతంలో నోకియా ఎక్స్ 5, ఎక్స్ 6 లాంచింగ్ మాదిరిగానే ఎక్స్ 7, ఎక్స్ 7ప్లస్‌ను లాంచ్ చేయనుందట. అధికారికంగా ధర, స్పెసిఫికేషన్స్‌పై ఎలాంటి సమాచారం అందుబాటులో లేనప్పటికీ అంచనాలు ఇలా ఉన్నాయి. ధర సుమారు రూ. 20వేలు, సెప్టెంబరు 15న విడుదల చేసే అవకాశం.
నోకియా ఎక్స్ 7 ఫీచర్లు
6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ స్క్రీన్,
స్నాప్‌డ్రాగన్ 710 సాక్ ప్రాసెసర్
4జీబీర్యామ్, 64 జీబీ స్టోరేజ్