నోకియా 9.3 ప్యూర్ వ్యూ లాంచ్ మరోసారి వాయిదా పడింది. నోకియా యొక్క కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ 2021 ప్రథమార్ధంలో లాంచ్ కానున్నట్లు సమాచారం. నోకియా 9.3 ప్యూర్ వ్యూను ఎప్పుడు లాంచ్ చేస్తారో సరైన సమాధానాన్ని తెలపలేదు. రాబోయే క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 875 ప్రాసెసర్ ని ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో తీసుకురానున్నట్లు సమాచారం. అందుకే ఈ ఆలస్యానికి కారణం అని తెలుస్తోంది. (చదవండి: 3 వేలలోనే రెడ్ మీ స్మార్ట్ వాచ్)
నోకియా 9.3 ప్యూర్ వ్యూ స్పెసిఫికేషన్లు ఎక్కువ శాతం విడుదల కాలేదు. ఇప్పటివరకు తెలిసిన సమాచారం మేరకు ఇందులో 120 హెర్ట్జ్ డిస్ ప్లేను అందించనున్నారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, 8కే వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉండనుంది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో హెచ్‌ఎండి గ్లోబల్ రాబోయే క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 875 ప్రాసెసర్ ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాసెసర్ డిసెంబర్‌లో లాంచ్ కానుంది. కాబట్టి ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్లస్‌ను అందించే బదులు స్నాప్ డ్రాగన్ 875ను అందిస్తే లేటెస్ట్ ప్రాసెసర్ తరహాలో ఉండే అవకాశం ఉంది.
అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీ స్నాప్ డ్రాగన్ 875 ప్రాసెసర్‌తో ఫోన్ల తయారీని జనవరిలో ప్రారంభించనున్నాయి. ఈ ఫోన్ లో స్టెయిన్ లెస్ స్టీల్ ఫ్రేమ్, సాఫైర్ గ్లాస్ డిస్ ప్లేతో వస్తుందని కంపెనీ పేర్కొంది. 2021 ద్వితీయార్ధంలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని నివేదిక పేర్కొంది. ఈ ఫోన్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే లాంచ్ అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే దీని లాంచ్ మాత్రం అప్నట్నుంచి వాయిదా పడుతూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment