ప్రిస్టినా: బాగా ఆకలి వేసిందో.. లేక మత్తులో ఉన్నాడో తెలియదు కానీ, ఓ వ్యక్తి ఏకంగా నోకియా ఫోన్‌ను మింగేశాడు. అనంతరం దాన్ని అలానే కడుపులో ఉంచుకోవడంతో ప్రాణం మీదకు వచ్చేసరికి ఆస్పత్రి మెట్లెక్కాడు. కోసోవోలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. యూరప్‌లోని కోసోవో రిపబ్లిక్ ప్రిస్టినాకు చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం నోకియా 3310 ఫోన్‌ను మింగేశాడు. ఫలితంగా అతని కడుపులో ఆ ఫోన్ ఇరుక్కుపోవడంతో బాధతో తల్లడిల్లిపోయి ఆస్పత్రికి వెళ్లాడు.
వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అతని కడుపులో ఫోన్ ఉన్నట్లు గుర్తించి షాకయ్యారు. అనంతరం లేటెస్ట్ టెక్నాలజీని వాడి, కడుపులోంచి ఫోన్‌ను బయటకు తీశారు. అతనికి ట్రీట్మెంట్ చేసిన వైద్యుడు మాట్లాడుతూ.. అతడికి స్కాన్ పరీక్షలు నిర్వహించిన తర్వాత కడుపులో ఫోన్ ఉన్నట్లు గుర్తించాము. అది కడుపులో వెళ్లిన అనంతరం మూడు భాగాలుగా విడిపోయి ఉందని, అన్నింటిని బాగానే బయటకు తీయగలిగామన్నారు. కాకపోతే బ్యాటరీని బయటకు తీసేటప్పుడే ఇబ్బంది ఎదురైందని, ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా అది కడుపు లోపలే పేలిపోయేదని తెలిపారు. అయితే, ఆ వ్యక్తి ఎందుకు ఫోన్ మింగాడన్న విషమంపై సమాచారం తెలియలేదు.
Comments
Please login to add a commentAdd a comment