Nokia C30 Jio Exclusive Offer: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నోకియా భారత మార్కెట్లలోకి మరో బడ్జెట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. నోకియా సీ30 స్మార్ట్‌ఫోన్‌ను గురువారం (అక్టోబర్ 21) రోజున లాంఛైంది. సీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో నోకియా సీ-30 అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుందని కంపెనీ పేర్కొంది. నోకియా ఈ స్మార్ట్‌ఫోన్‌కు రెండు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ వోఎస్ అప్‌డేట్స్‌ను కూడా అందించనుంది.
చదవండి: పేరు మార్చుకోనున్న ఫేస్‌బుక్? కారణాలు ఏంటంటే..
నోకియా సీ30 3జీబీ, 4జీబీ ర్యామ్ వేరియంట్లలో రానుంది. నోకియా సీ30 (3జీబీ+32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 10999 కాగా, 4జీబీ+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999. గ్రీన్, వైట్ కలర్స్ వేరియంట్స్‌లో నోకియా సీ30 లభించనుంది.
ఫోన్ కొనుగోలుపై జియో ఆఫర్..!
ఈ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ జియో భాగస్వామ్యంతో నోకియా కొనుగోలు చేయనుంది. మై జియో యాప్ లేదా జియో స్టోర్లలో నోకియా సీ30 కొనుగోలుపై 10 శాతం సుమారు రూ. 1000 వరకు తక్షణ డిస్కౌంట్‌ను జియో అందించనుంది. స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో ఆయా కొనుగోలుదారుడికి యూపీఐ రూపంలో రూ. 1000 తగ్గింపుతో పేమెంట్ అప్షన్ వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారుడు జియో నెట్‌వర్క్‌ను వాడినట్లైతే రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తే మింత్రా, ఫార్మ్‌ఈజీ, ఓయో, మేక్ మై ట్రిప్‌ల్లో సుమారు రూ. 4 వేల వరకు ఇతర బెనిఫిట్స్‌ను కూడా జియో అందిస్తోంది.
నోకియా సీ-30 ఫీచర్స్
- ఆండ్రాయిడ్ 11
- 6.82 అంగుళాల హెచ్‌డీ+డిస్‌ప్లే
- ఆక్టాకోర్ యునిసోక్ ప్రాసెసర్
- 4జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 13+2 ఎమ్‌పీ డ్యూయల్ రియర్ కెమెరా
- 5ఎమ్‌పీ ఫ్రంట్ కెమెరా
- 6000ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ
- 10 వాట్స్ ఛార్జింగ్
- ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్
చదవండి: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment