సాక్షి, న్యూఢిల్లీ : నోకియా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపు ధరలను ప్రకటించింది. నోకియా 8.1 ను రాయితీ ధరల్లోఅందుబాటులోకి తీసుకొచ్చింది. బేసిక్ వేరియంట్ (4జీబీర్యామ్/64 జీబీ స్టోరేజ్) తోపాటు, హై ఎండ్ వేరియంట్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ డివైస్‌పై డిస్కౌంట్‌ను అందిస్తోంది. రెండు ఫోన్లపై రూ. 7వేల దాకా ధర తగ్గించింది నోకియా
నోకియా 8.1 ధరలు
4జీబీర్యామ్/64 జీబీ స్టోరేజ్ లాంచింగ్ ధర రూ. 26,999 ప్రస్తుత ధర రూ. 19.999
6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ లాంచింగ్ ధరధర రూ. 29,999, ప్రస్తుత ధర రూ. 22.999
ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఆఫర్ : ఎయిర్టెల్ ప్రీపెడ్ కస్టమర్లకు 199 రీచార్జ్‌పై 1టీబీ 4జీ డేటా అదనం. రూ.499 లకుపైన రీచార్జీ్ చేసుకునే పోస్ట్ పోయిడ్ వినిగాదారులకయితే 120 జీబీ డేటా అదనం. అలాగే మూడు నెలల నెట్‌ఫ్లిక్స్ ఉచితం. అమెజాన్ ప్రైమ్ ఏడాది పాటు ఉచితం. అంతేకాదు నాలుగువేల రూపాయల విలువైన స్క్రీన్ రీప్లేస్‌మెంట్ అవకాశం (ఒకసారి) కూడా కల్పిస్తోంది.
నోకియా 8.1 ఫీచర్లు
6.18 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1080x2244 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 సాక్
13 +12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
20 ఎంపీ సెల్ఫీ కెమెరా
3500 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment