ఇండియాలో తొలి 18జీబీ ర్యామ్‌ ఫోన్ విడుదల | Asus Rog Phone 5 Launched In India With 18GB RAM | Sakshi
Sakshi News home page

ఇండియాలో తొలి 18జీబీ ర్యామ్‌ ఫోన్ విడుదల

Published Wed, Mar 10 2021 8:38 PM | Last Updated on Thu, Mar 11 2021 1:45 AM

Asus Rog Phone 5 Launched In India With 18GB RAM - Sakshi

ఆసుస్ రోగ్ ఫోన్ 5 మొబైల్ ను మనదేశంలో విడుదల చేసింది. ఈ సరికొత్త గేమింగ్ ఫోన్ మూడు విభిన్న మోడళ్లలో తీసుకొచ్చారు. అసుస్ రోగ్ ఫోన్ 5, రోగ్ ఫోన్ 5 ప్రో, రోగ్ ఫోన్ 5 అల్టిమేట్(లిమిటెడ్ ఎడిషన్). ఈ మూడు మోడళ్లు 144 హెర్ట్జ్ శామ్‌సంగ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తాయి. ఇవి రోగ్ ఫోన్ 3 కంటే 23 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాయి. రోగ్ ఫోన్ 5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో గేమ్ కూల్ 5 అనే ఫీచర్ ఉండనుంది. రోగ్ ఫోన్ 5లో ఎయిర్ ట్రిగ్గర్ 5 అనే కొత్త ఫీచర్‌ను అందించారు. భారత దేశంలో 18జీబీ ర్యామ్ తో వచ్చిన తోలి మొబైల్ అసుస్ రోగ్ ఫోన్ 5 అల్టిమేట్.

అసుస్ రోగ్ ఫోన్ 5 ఫీచర్లు: 
డిస్‌ప్లే: 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ
రిఫ్రెష్ రేట్: 144 హెర్ట్జ్‌
ప్రాసెసర్‌: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888
ర్యామ్: 18 జీబీ
స్టోరేజ్: 512 జీబీ
ఫ్రంట్ కెమెరా: 64 ఎంపీ + 13 ఎంపీ + 5 ఎంపీ
సెల్పీ కెమెరా: 24 ఎంపీ
బ్యాటరీ: 6000 ఎంఏహెచ్
ఫాస్ట్ చార్జింగ్: 65 వాట్
ఓఎస్: ఆండ్రాయిడ్ 11 

అసుస్ రోగ్ ఫోన్ 5 ధర: 
  8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్: రూ.49,999
12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్: రూ.57,999

అసుస్ రోగ్ ఫోన్ 5 ప్రో ధర: 
16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్‌: రూ.69,999

అసుస్ రోగ్ ఫోన్ 5 అల్టిమేట్ ధర:
18 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్: రూ.79,999

చదవండి: 

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్!

ఇండియాలో పబ్‌జీ మళ్లీ రానుందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement