Asus mobiles
-
Asus ROG Phone 3 : చేతిలో ఇమిడిపోయే గేమింగ్ ఫోన్
గేమింగ్ మార్కెట్ లో విడుదలయ్యే గేమ్స్ ను అరచేతిలో ఇమిడిపోయే ఫోన్ లో ఆడే సౌకర్యం ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటున్నారా? పాత స్మార్ట్‌ఫోన్‌ను పక్కనపెట్టి కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు గేమింగ్ కోసం కొత్త స్మార్ట్ ఫోన్ ను కొనాలని చూస్తున్నట్లైతే ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అసుస్ తన కొత్త ఫోన్లపై ఆఫర్లని ప్రకటించింది. జూన్ 13 నుంచి జూన్ 16 మధ్య ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆసుస్ ROG Phone 3 ధరపై భారీ ఆఫర్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఫోర్ట్‌నైట్, ఎపిక్ గేమ్స్, పబ్జీ లేదా బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ ను ఈ స్మార్ట్ ఫోన్లలో ఆడుకోవచ్చని ఆసుస్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక ఆసుస్ ROG Phone 3 ను కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఈఎంఐ ద్వారా చెల్లించే సదుపాయం ఉంది. ఆసుస్ ROG Phone 3 ఫీచర్స్ ఆసుస్ ROG Phone 3 లో 6.59-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ , 2340 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 1,000 నిట్స్, ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ తో వస్తుంది ఆన్-డిస్ప్లే, HDR10 మరియు HDR10 + టెక్నాలజీలకు సపోర్ట్ చేస్తోంది ఆసుస్ ROG Phone 3 ప్రాసెసర్ ఆసుస్ ROG Phone 3 ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్ 5 జి ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది క్వాల్కమ్ అడ్రినో 650 GPU తో కలిసి ఉంటుంది. 12జీబీ RAM మరియు 512జీబీ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఆసుస్ ROG Phone 3 కెమెరా కెమెరా ముందు భాగంలో ఆసుస్ ROG Phone 3 లో 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. వెనుక భాగంలో, సోనీ IMX686 సెన్సార్, 16 మెగాపిక్సెల్ సెన్సార్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ మరియు 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆసుస్ ROG Phone 3 కనెక్టివిటీ కనెక్టివిటీ కోసం ఆసుస్ ROG Phone 3 లో బ్లూటూత్ V5.1, Wi-Fi, డ్యూయల్-స్టాండ్‌బై సపోర్ట్ డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆసుస్ ROG Phone 3 బ్యాటరీ ఇది 30W పవర్ అడాప్టర్‌తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీకి మద్దతునిస్తుంది. చదవండి : జియో ఫోన్ వినియోగదారులకు శుభవార్త! -
గేమింగ్ ఫోన్‌పై ఏకంగా రూ.14 వేల తగ్గింపు
ఫ్లిప్‌కార్ట్ మొబైల్ కార్నివాల్లో అసుస్ రోగ్ ఫోన్ 3పై భారీ తగ్గింపును అందించింది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.10,000 తగ్గింపు లభించడం విశేషం. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్‌ను అందించారు. 6.59 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే, 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర గతంలో రూ.55,999గా ఉండగా ఈ సేల్‌లో రూ.41,999కే విక్రయిస్తున్నారు. అలాగే, 12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.57,999 నుంచి రూ.12,000 తగ్గింపుతో రూ.45,999కు అందిస్తున్నారు. అసుస్ రోగ్ ఫోన్ 3 ఫీచర్లు: 6.59 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ హెచ్డీఆర్ డిస్ ప్లే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ 64 ఎంపీ + 13 ఎంపీ + 5 ఎంపీ మెయిన్ కెమెరా 24 ఎంపీ సెల్పీ కెమెరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ 5జీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ చదవండి: బజాజ్ చేతక్ స్కూటర్స్‌కి భారీ డిమాండ్! -
ఇండియాలో తొలి 18జీబీ ర్యామ్ ఫోన్ విడుదల
ఆసుస్ రోగ్ ఫోన్ 5 మొబైల్ ను మనదేశంలో విడుదల చేసింది. ఈ సరికొత్త గేమింగ్ ఫోన్ మూడు విభిన్న మోడళ్లలో తీసుకొచ్చారు. అసుస్ రోగ్ ఫోన్ 5, రోగ్ ఫోన్ 5 ప్రో, రోగ్ ఫోన్ 5 అల్టిమేట్(లిమిటెడ్ ఎడిషన్). ఈ మూడు మోడళ్లు 144 హెర్ట్జ్ శామ్సంగ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తాయి. ఇవి రోగ్ ఫోన్ 3 కంటే 23 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాయి. రోగ్ ఫోన్ 5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో గేమ్ కూల్ 5 అనే ఫీచర్ ఉండనుంది. రోగ్ ఫోన్ 5లో ఎయిర్ ట్రిగ్గర్ 5 అనే కొత్త ఫీచర్‌ను అందించారు. భారత దేశంలో 18జీబీ ర్యామ్ తో వచ్చిన తోలి మొబైల్ అసుస్ రోగ్ ఫోన్ 5 అల్టిమేట్. అసుస్ రోగ్ ఫోన్ 5 ఫీచర్లు: డిస్ప్లే: 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ రిఫ్రెష్ రేట్: 144 హెర్ట్జ్ ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ర్యామ్: 18 జీబీ స్టోరేజ్: 512 జీబీ ఫ్రంట్ కెమెరా: 64 ఎంపీ + 13 ఎంపీ + 5 ఎంపీ సెల్పీ కెమెరా: 24 ఎంపీ బ్యాటరీ: 6000 ఎంఏహెచ్ ఫాస్ట్ చార్జింగ్: 65 వాట్ ఓఎస్: ఆండ్రాయిడ్ 11 అసుస్ రోగ్ ఫోన్ 5 ధర: 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్: రూ.49,999 12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్: రూ.57,999 అసుస్ రోగ్ ఫోన్ 5 ప్రో ధర: 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్: రూ.69,999 అసుస్ రోగ్ ఫోన్ 5 అల్టిమేట్ ధర: 18 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్: రూ.79,999 చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! ఇండియాలో పబ్జీ మళ్లీ రానుందా? -
అధ్బుత ఫీచర్లతో ఆసుస్ స్మార్ట్‌ఫోన్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ దారు ఆసుస్ తాజాగా మరో కొత్త స్మా్ర్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. జెన్ ఫోన్ సిరీస్‌లో ‘జెన్‌ఫోన్ 6’ పేరుతో సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేసింది. స్పెయిన్‌లో గురువారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ ఈ ఫోన్‌ను ఆ విష్కరించింది. ఈ ఫోన్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి కూడా రానుంది. రొటేటింగ్ కెమెరా జెన్‌ఫోన్ 6 స్పెషల్ ఎట్రాక్షన్ అని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరాను మనకను గుణంగా ముందుకు, వెనక్కు రొటేట్ చేసుకోవచ్చన్నమాట. 8 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ 6 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ ఇలా మూడు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఆసుస్ జెన్‌ఫోన్ 6 ఫీచర్లు 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ఆండ్రాయిడ్ 9.0 పై 48+13 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ ధర : రూ.39,000 నుంచి ప్రారంభం -
శ్రీసిటీలో ఆసస్ మొబైల్స్ తయారీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న తైవాన్ కంపెనీ ఆసస్ టెక్నాలజీస్ మేక్ ఇన్ ఇండియా బాట పట్టింది. కాంట్రాక్ట్ తయారీలో ఉన్న ఫాక్స్‌కాన్‌తో చేతులు కలిపింది. ఆంధ్రప్రదేశ్ శ్రీసిటీలో ఉన్న ఫాక్స్‌కాన్ ప్లాంటులో ఆసస్ మొబైల్స్ రూపొందనున్నాయి. ఆసస్ జెన్‌ఫోన్ స్మార్ట్ఫోన్లకు దేశీయంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో తయారీ ప్లాంటు ఉండాలన్న తలంపుతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంటది. ప్లాంటులో నెలకు 1.5 లక్షల ఫోన్లను ఉత్పత్తి చేస్తారు. తొలుత జెన్‌ఫోన్ 2 లేసర్, జెన్‌ఫోన్ గో మోడళ్లు తయారు కానున్నాయి. డిసెం బర్ నాటికి జెన్‌ఫోన్ సెల్ఫీ మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. లెనోవో, షావొమీ, జియోనీ ఫోన్లు సైతం ఫాక్స్‌కాన్ శ్రీసిటీ ప్లాంటులోనూ తయార వుతున్న సంగతి తెలిసిందే. 5 శాతం వాటా లక్ష్యం.. స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట ్లలో భారత్ ఒకటి. ఇక్కడి మార్కెట్‌పై ఆసస్ భారీ అంచనాలు పెట్టుకుంది. కంపెనీ ఆఫర్ చేస్తున్న మోడళ్ల వ్యూహాత్మక ధరల కారణంగా 2016 మార్చినాటికి భారత స్మార్ట్ఫోన్ల మార్కెట్లో 5 శాతం వాటాను లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం మార్కెట్ వాటా 2 శాతమున్నట్టు కంపెనీ చెబుతోంది. భారత్‌లో తాము విక్రయిస్తున్న ఫోన్లలో 80 శాతం దేశీయంగా తయారు చేయాలన్నది ప్రణాళిక అని ఆసస్ దక్షిణాసియా హెడ్ పీటర్ చాంగ్ తెలిపారు. మంచి ఫీచర్లు, డిజైన్ కోరుకునేవారికి అత్యుత్తమ మోడళ్లను అందుబాటు ధరలో అందిస్తామన్నారు. భారత్‌లో తయారీ చేపట్టడం వల్ల వ్యయం 3 శాతం తగ్గుతుందని చెప్పారు.