
గేమింగ్ మార్కెట్ లో విడుదలయ్యే గేమ్స్ ను అరచేతిలో ఇమిడిపోయే ఫోన్ లో ఆడే సౌకర్యం ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటున్నారా? పాత స్మార్ట్‌ఫోన్‌ను పక్కనపెట్టి కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు గేమింగ్ కోసం కొత్త స్మార్ట్ ఫోన్ ను కొనాలని చూస్తున్నట్లైతే ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అసుస్ తన కొత్త ఫోన్లపై ఆఫర్లని ప్రకటించింది. జూన్ 13 నుంచి జూన్ 16 మధ్య ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆసుస్ ROG Phone 3 ధరపై భారీ ఆఫర్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఫోర్ట్‌నైట్, ఎపిక్ గేమ్స్, పబ్జీ లేదా బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ ను ఈ స్మార్ట్ ఫోన్లలో ఆడుకోవచ్చని ఆసుస్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక ఆసుస్ ROG Phone 3 ను కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఎస్‌బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఈఎంఐ ద్వారా చెల్లించే సదుపాయం ఉంది.
ఆసుస్ ROG Phone 3 ఫీచర్స్
ఆసుస్ ROG Phone 3 లో 6.59-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ , 2340 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 1,000 నిట్స్, ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ తో వస్తుంది ఆన్-డిస్ప్లే, HDR10 మరియు HDR10 + టెక్నాలజీలకు సపోర్ట్ చేస్తోంది
ఆసుస్ ROG Phone 3 ప్రాసెసర్
ఆసుస్ ROG Phone 3 ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్ 5 జి ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది క్వాల్కమ్ అడ్రినో 650 GPU తో కలిసి ఉంటుంది. 12జీబీ RAM మరియు 512జీబీ వరకు స్టోర్ చేసుకోవచ్చు.
ఆసుస్ ROG Phone 3 కెమెరా
కెమెరా ముందు భాగంలో ఆసుస్ ROG Phone 3 లో 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. వెనుక భాగంలో, సోనీ IMX686 సెన్సార్, 16 మెగాపిక్సెల్ సెన్సార్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ మరియు 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
ఆసుస్ ROG Phone 3 కనెక్టివిటీ
కనెక్టివిటీ కోసం ఆసుస్ ROG Phone 3 లో బ్లూటూత్ V5.1, Wi-Fi, డ్యూయల్-స్టాండ్బై సపోర్ట్ డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
ఆసుస్ ROG Phone 3 బ్యాటరీ
ఇది 30W పవర్ అడాప్టర్‌తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీకి మద్దతునిస్తుంది.
చదవండి : జియో ఫోన్ వినియోగదారులకు శుభవార్త!
Comments
Please login to add a commentAdd a comment