గెలాక్సీ ఎస్ 21లో రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ | Samsung Galaxy S21 Certified By FCC With 9W Reverse Wireless Charging | Sakshi
Sakshi News home page

గెలాక్సీ ఎస్ 21లో రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ

Published Wed, Dec 9 2020 3:58 PM | Last Updated on Wed, Dec 9 2020 4:04 PM

Samsung Galaxy S21 Certified By FCC With 9W Reverse Wireless Charging - Sakshi

శామ్సంగ్ వచ్చే నెలలో గెలాక్సీ ఎస్ 21 ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది. అయితే గెలాక్సీ ఎస్ 21లో రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి SM-G991U అనే కోడ్ పేరుతో ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(FCC) నుండి అనుమతి కూడా లభించినట్లు సమాచారం. ఇందులో 25వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ప్రధానంగా ఈ ఫోన్ 9వాట్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానుంది. అందుకే కొత్తగా రాబోయే గెలాక్సీ ఎస్ 21 ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్ ఫోన్ రేట్లను కూడా పెంచినట్లు తెలుస్తుంది. దీనిలో తీసుకురాబోయే EP-TA800 అడాప్టర్‌ను అమెరికా రెగ్యులేటరీ కూడా ఆమోదించింది. చూడాలి మరి ఈ స్పెసిఫికేషన్స్ తో అమెరికాలో విడుదల అవుతుందో లేదో. ఆపిల్ ఇప్పటికే ఈ టెక్నాలజీని అమెరికా మార్కెట్ లోకి తీసుకోని వచ్చింది. ఇప్పటి వరకు తెల్సిన సమాచారం ప్రకారం ఇందులో స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్, 8 జిబి ర్యామ్ మరియు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఫ్లాట్ 6.3 స్క్రీన్ రానుంది. ఎప్పటిలాగే, మూడు హ్యాండ్‌సెట్‌లు ఎస్ 21, ఎస్ 21 ప్లస్ మరియు ఎస్ 21 అల్ట్రా మధ్య ఫీచర్స్ లో కొద్దీ పాటి తేడాలు ఉండనున్నాయి. (చదవండి: షియోమి నుంచి మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement