ప్రముఖ చిప్‌సెట్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ తర్వాత తరం రాబోయే చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 895 ప్రాసెసర్ కోసం పనిచేస్తోంది. అలాగే, ఈ కంపెనీతో పాటు శామ్‌సంగ్ కూడా తర్వాతి తరం ఎక్సినోస్ 2200 ప్రాసెసర్ కోసం పనిచేస్తున్నాయి. ఈ రెండూ కంపెనీలు కూడా ప్రధానంగా మొబైల్ గేమర్లను లక్ష్యంగా పెట్టుకొని వస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఉన్న ఎఎమ్ డి ఆర్‌డీఎన్‌ఎ జీపీయు గ్రాఫిక్స్ వల్ల గేమర్స్ కి అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. లెనోవో చైనా ఫోన్ బిజినెస్ మేనేజర్ చెన్ జిన్ వీబోలో పోస్ట్ చేసిన ప్రకారం.. స్నాప్‌డ్రాగన్ 895 చిప్‌సెట్ అప్ గ్రేడ్ జీపీయుతో రానుంది.
లెనోవో కంపెనీ నుంచి రాబోయే ఫ్లాగ్ షిప్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ లెజియన్ 3 ప్రోను టీజ్ చేసినప్పుడు అతను ఈ సమాచారాన్ని వెల్లడించాడు. స్నాప్‌డ్రాగన్ 895 ప్రాసెసర్ ఎస్ఎమ్ 8450 అని కోడ్ నేమ్ కలిగి ఉంది. ఈ ఏడాది చివరిలో హవాయిలో క్వాల్‌కామ్ వార్షిక సమావేశంలో లాంఛ్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు వస్తున్న లీక్స్ ప్రకారం, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 895 ప్రాసెసర్, ఎక్స్65 5జీ మోడెంను 4 ఎన్ఎమ్ మీద నిర్మిస్తున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ 5 ఎన్ఎమ్ మీద తయారు చేశారు. స్నాప్‌డ్రాగన్ 895 గల ఫోన్లు ఎంఎంవేవ్/సబ్-5 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ గల 5జీ నెట్ వర్క్ లను కనెక్ట్ చేస్తాయి. ప్రస్తుతం, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 895, ఎక్సినోస్ 2200 ప్రాసెసర్ తో పోటీ పడటానికి సిద్దం అవుతుంది.(చదవండి: మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు)
గేమ్ ఛేంజర్
ఎక్సినోస్ 2200 చిప్‌సెట్ కొన్ని బెంచ్ మార్క్ లలో యాపిల్ ఏ14 బయోనిక్ చిప్‌సెట్ ను అధిగమించినట్లు సమాచారం. ముఖ్యంగా, మాన్హాటన్(Manhattan) 3.0 1080పీ అని పిలిచే ఒక బెంచ్ మార్క్ లో ఎక్సినోస్ 2200 చిప్‌సెట్ సెకనుకు 170.7 ఫ్రేమ్ లను నమోదు చేసింది. ఇది ఏ14 బయోనిక్, స్నాప్ డ్రాగన్ 888 చిప్‌సెట్ లు నమోదు చేసిన 120 ఫ్రేమ్స్ కంటే చాలా ఎక్కువ. 2022లో స్నాప్‌డ్రాగన్ 895, ఎక్సినోస్ 2200 ప్రాసెసర్ గల శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్లను మనం చూసే అవకాశం ఉంది. షియోమీ, వన్ ప్లస్, ఒప్పో వంటి కంపెనీలు తమ ఫ్లాగ్ షిప్ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 895 ప్రాసెసర్ ఉపయోగించవచ్చు. ఇక అప్పటి మార్కెట్ ని బట్టి శామ్‌సంగ్ స్నాప్‌డ్రాగన్ 895, ఎక్సినోస్ 2200 ప్రాసెసర్ లను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు.. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్21 అల్ట్రాలో స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ ను యుఎస్ వంటి మార్కెట్లలో తీసుకొస్తే, ఇతర మార్కెట్లలో ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ తీసుకొని వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment