![Realme GT Neo 2 key specs confirmed ahead of September 22 launch - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/19/realme_gt_neo_2.jpg.webp?itok=Ofk526qU)
రియల్‌మీ తన జీటీ నియోను 2 సెప్టెంబర్ 22న చైనాలో విడుదలకు చేయడానికి సిద్దం అవుతుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఇప్పటికే లాంఛ్ కు ముందు కొన్ని స్పెసిఫికేషన్లను బయటకు విడుదల చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. రియల్‌మీ జీటీ నియో 2లో స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ తీసుకొనివస్తున్నారు. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్ శామ్ సంగ్ ద్వారా ఈ4 అమోల్డ్ ప్యానెల్ తో రానుంది. దీనిలో 120హెర్ట్జ్ రిఫ్రెష్ గల డిస్ప్లే తో వస్తుంది.
ఈ ఫోన్ 6.62 అంగుళాల డిస్ ప్లే ఎఫ్ హెచ్ డీ+ రిజల్యూషన్ తో కలిగి ఉండనుంది. దీనిలో 65డబ్ల్యు డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో రానుంది. జీటీ నియో 2, 64 ఎంపి సెన్సార్ గల ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుందని రియల్ మీ ధృవీకరించింది. ఈ ఫోన్ 8జీబీ, 12జీబీ ర్యామ్ ఆప్షన్లతో కూడా వస్తుందని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే విషయంపై ఇంకా సంస్థ క్లారిటీ ఇవ్వలేదు. (చదవండి: బ్లాక్‌బస్టర్ డీల్స్‌తో..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్)
Comments
Please login to add a commentAdd a comment