స్మార్ట్ ఫోన్ వినియోగంలో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో తమ మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు ఆయా టెక్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే క్యూ3 స్మార్ట్ ఫోన్ ఫలితాల్లో 25శాతం ఉన్న రియల్ మీ ప్రత్యర‍్ధి కంపెనీల కంటే దూకుడుగా స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. తద్వారా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పట్టు సాధించాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో రియల్ మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ 'రియల్ మీ క్యూ3టీ'ని మార్కెట్‌కి పరిచయం చేసింది. త్వరలో ఇండియాలో విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫీచర్‌లు వెలుగులోకి వచ్చాయి. అవి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
రియల్ మీ క్యూ3టీ ఫీచర్లు
మార్కెట్‌లో విడుదలైన రియల్ మీ క్యూ3టీ సిరీస్ ఫోన్‌లు హ్యాండ్‌సెట్ నెబ్యులా, నైట్ స్కై బ్లూ కలర్స్‌తో అందుబాటులోకి రానుంది. 6.6 అంగుళాల పొడవు, పూర్తి హెచ్‌డీ ఐపీఎస్ ఎల్‌సీడీ,(1,080x2,412 పిక్సెల్‌లు) 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు 90.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంది. ఆండ్రాయి11 వెర్షన్ కు సపోర్ట్ చేస్తున్న ఈఫోన్‌లోతాజా క్యూ3 సిరీస్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ట్రిపుల్ రేర్ కెమెరాతో పాటు, వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 144హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను అందిస్తుంది. 30డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో విడుదలైంది.
రియల్ మీ క్యూ3టీ ధర
8జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ ధర చైనాలో సీఎన్‌వై2,099 (భారత కరెన్సీలో దాదాపూ రూ. 24,300)గా నిర్ణయించబడింది. నైట్ బ్లూ,నైట్ స్కై బ్లూ కలర్స్‌తో ఇండియన్ మార్కెట్‌లో విడుదల కానుంది. కాగా, ప్రస్తుతం చైనా మార్కెట్‌లో విడుదలైన ఈ ఫోన్ త్వరలో ఇండియాలో విడుదల చేయాలని రియల్ మీ ప్రతినిధులు భావిస్తున్నారు.
చదవండి: దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా కొంటున్న 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే..!
Comments
Please login to add a commentAdd a comment